E-Paper
Advertisement

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని స్పాట్‌లో వ్యక్తి మృతి!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని స్పాట్‌లో వ్యక్తి మృతి!
Advertisement

Shamirpet Accident: టిప్పర్‌ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోతారం రెవెన్యూ పరిధిలో తండూరి రెస్టారెంట్‌ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.

ఇంటికి తిరిగి వస్తుండగా..

మూడు చింతలపల్లికి చెందిన పొన్న కృష్ణ (54) ఎంసీపల్లిలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని తుర్కపల్లి నుంచి మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా పోతారం సమీపంలో టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

ముగ్గురు కుమార్తెలు..

Advertisement

మృతుడు కృష్ణకు భార్య ఎల్లమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన మల్లి సీరియల్ నటి!

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1నుండి వాటర్ ట్యాంకర్లు..?

అమిత్ షా మహా పాదయాత్రతో.. రాంచందర్ రావు కీలక ఆదేశాలు జారీ!

తెలంగాణకు అమిత్ షా రాక.. హైదరాబాద్‌ పర్యటనకు షెడ్యూల్ ఖరారు!

రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద.. హైడ్రా సంచలన కూల్చివేతలు!

ఎల్ నినో ఎఫెక్ట్.. మండుతున్న నిత్యావసరాల ధరలు..!

ఆరో తరగతి చదువుతున్న కూతురిపై.. సవతి తండ్రి లైంగిక దాడి!

సీఎం రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ సవాల్!

Big Stories

Advertisement
×