Big Stories

Rythu Bandhu: మీ ఖాతాలో డబ్బులు పడ్డాయ్..! చెక్ చేసుకోండి

Rythu Bandhu Funds Released(Telangana news today): పలువురు రైతులకు ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూడా ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నటువంటి రాష్ట్ర రైతులకు ప్రభుత్వం సోమవారం రైతుబంధు నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే, ఆ నిధులు ఆర్థిక శాఖ ద్వారా బ్యాంకులకు చేరగా సోమవారం నుంచి ఎకరాకు రూ. 5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిసింది. అయితే, మార్చి 28 నాటికి రాష్ట్రంలోని 64,75,320 మంది రైతుల ఖాతాల్లో రూ. 5,575 కోట్ల రైతుబంధు నిధులను జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన రైతులకు నిధుల విడుదల ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో 5 ఎకరాలకు పైగా ఉన్నరైతులు దాదాపుగా అయిదున్నర లక్షల మంది, 10 నుంచి 24 ఎకరాలు ఉన్నవారు 94 వేలు, 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు 6వేలకు పైగా మంది ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
Rythu bandhu Funds
Rythu bandhu Funds

అయితే, మొదటగా 5 ఎకరాలు ఉన్న రైతలకు మాత్రమే రైతుబంధు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించిందని, అయితే, మిగతావారు కూడా కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి కూడా రైతుబంధు నిధులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రక్రియంతా కూడా మూడు రోజుల్లోనే పూర్తవనున్నదని తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావుడీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపే దిశగా ముందుకు వెళ్తూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకెళ్తోంది. తమ అభ్యర్థులను గెలుచుకునేందుకు ముమ్మర ప్రచారం నిర్వహిస్తుంది. ఈ ప్రచార సభలు, ర్యాలీలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఈ నెల 9 లోగా రైతులకు రైతుబంధు డబ్బులు విడుదల చేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Also Read: ఈ వార్త తెలిస్తే పొద్దుపొద్దున్నే మీరు ఎగిరి గంతేస్తారు..!

అయితే, ప్రభుత్వం తాజాగా రైతుబంధు నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News