BigTV English

Sajjala VS Sharmila : సజ్జలకు షర్మిల కౌంటర్.. ముందు ఏపీ పరిస్థితి చూసుకోవాలని హితువు

Sajjala VS Sharmila : సజ్జలకు షర్మిల కౌంటర్.. ముందు ఏపీ పరిస్థితి చూసుకోవాలని హితువు
YS Sharmila vs Sajjala

Sajjala VS Sharmila(AP political news) :

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై షర్మిల సజ్జలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.


షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణలో తాను కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు తాను కాంగ్రెస్‌కు మద్దతిస్తుంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

తనపై మాట్లాడడం సులువు కాని, ముందు ఏపీలో పరిస్థితులపై కేసీఆర్, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల పట్ల సజ్జల సమాధానం చెప్పాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో గద్దె దింపే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని, అందుకే తాను ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.


“నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే… ఆమె పార్టీ పెడితే మాకేంటి సంబంధం అన్న వ్యక్తి సజ్జల. ఇవాళ ఆయన ఏ సంబంధం ఉందని మాట్లాడుతున్నారు? నేనయితే ఏ సంబంధం లేదనే అనుకుంటున్నాను. మరి మీరు మాట్లాడుతున్నారంటే సంబంధం కలుపుకుంటున్నారని అనుకోవాలా? దీనికి సజ్జల సమాధానం చెప్పాలి. ఓవైపు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితిపై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ… చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అంటున్నారే… దీనికి సజ్జల ఏం సమాధానం చెబుతారు?” అని షర్మిల ప్రశ్నించారు.

షర్మిల తను కొత్తగా తెలంగాణలో స్థాపించిన వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ రాబోయే ఎన్నికలలో పోటీచేయడం లేదని ఇటీవలే ప్రకటించారు. అదే సమయంలో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి వేధించిన పార్టీతోనే షర్మిల కలిశారని సజ్జల ఆరోపించారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమని ఆయన క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ఆర్ కుటుంబాన్ని వేధించి.. ఇబ్బందులు పెట్టిందన్న సంగతి అందరికీ తెలుసునని ఆయన గుర్తుచేశారు. సీఎం జగన్‌పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన పార్టీ కాంగ్రెస్ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలపడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×