E-Paper
Advertisement

Budvel : బుద్వేల్‌ లో భూముల అమ్మకం.. ఎకరా కనీస ధర ఎంతంటే?

Budvel : బుద్వేల్‌ లో భూముల అమ్మకం.. ఎకరా కనీస ధర ఎంతంటే?
Advertisement
Hyderabad land auction news

Hyderabad land auction news(Telangana news live):

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నగరం శివారు ప్రాంతాల్లో ధరలు ఆకాశ్నానంటుతున్నాయి. తాజాగా కోకాపేట భూములు ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. ఎకరం రూ. 100 కోట్లకు అమ్ముడు పోయింది. నగరంలో చట్టపక్కల ప్రాంతాల్లోని భూములు భారీ ధరలు పలుకుతున్నాయి.

తెలంగాణ సర్కార్ ఒక్కో ప్రాంతంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతోంది. భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. కోకాపేట భూముల వేలంగా సర్కార్ కు భారీ ఆదాయం వచ్చింది. తాజాగా మరో ప్రాంతంలో భూములను అమ్మకానికి పెట్టింది. బుద్వేల్ భూముల అమ్మకానికి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో బుద్వేల్‌ ఉంది. ఇక్కడ బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా స్థలాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. మౌలిక వసతులు కల్పించింది. అన్ని సౌకర్యాల సమకూర్చి అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. విస్తీర్ణం 3.47 ఎకరాలు నుంచి 14.33 ఎకరాల మధ్య ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఎకరా కనీస ధరను రూ.20 కోట్లగా నిర్ణయించారు. ఆగస్టు 6న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. ఆగస్టు 8న సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. ఈ నెల 10న ఈ -వేలం నిర్వహిస్తారు. బుద్వేల్ లో ఎకరా సగటున రూ. 30 కోట్లకు అమ్ముడుపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ భూమల వేలందా ద్వారా కనీసం రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×