E-Paper
Advertisement

అబద్ధాలతో బురద చల్లడం అలవాటే.. బొంద పెట్టే రోజులు దగ్గరలోనే-సామ

అబద్ధాలతో బురద చల్లడం అలవాటే.. బొంద పెట్టే రోజులు దగ్గరలోనే-సామ
Advertisement

Hyderabad: తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. నేతల మధ్య మాటలు కాస్త.. ఇప్పుడు అధికారుల వైపు మళ్లాయి. తాజాగా కేటీఆర్, వారి గెజిట్ పేపర్‌పై విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి. ఇంతకీ సామ ఎందుకు ఆ విధంగా ఎక్స్ లో రాసుకొచ్చారు? దీని వెనుక అసలు ఏం జరిగింది?

బీఆర్ఎస్, గుమస్తా పేపర్‌పై సామ ఆగ్రహం

బీఆర్ఎస్ పార్టీ గెజిట్ పత్రిక గురించి చెప్పనక్కర్లేదు. నిత్యం అధికార పార్టీపై బురద జల్లుతూనే ఉంటుంది. ‘సీఎం సమక్షంలో దళిత ఐపీఎస్‌కు అవమానం అంటూ తాటికాయంత అక్షరాలతో ఓ వార్త ప్రచురించింది. దానికి కింద ఇంకా చాలానే రాసుకొచ్చింది. గణేష్ ఉత్సావాల సమీక్షలో అంటరానితనం, ప్రొటోకాల్ ను పక్కనపెట్టి సామాజికవర్గాలకు ప్రాధాన్య’మని రాసుకొచ్చింది. దీన్ని గమనించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశ్నించారు. ఆ వార్త పేపర్ కట్ చేసి.. గతంలో కేటీఆర్ చేసిన ట్వీట్‌ను లింకు పెట్టి రాసుకొచ్చారు.

Advertisement

ALSO READ: ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?

అబద్ధాలు రాయించడం, అడ్డంగా మళ్ళీ మళ్ళీ దొరికిపోవడం ఈ బేకర్ రాష్ట్ర సమితి నాయకులకు వారి గుమస్తా పేపర్లకు అలవాటని రాసుకొచ్చారు. ఏమంటావ్ కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. తప్పుడు కథనాలు, అబద్ధపు రాతలని మండిపడ్డారు. వీళ్లు రాసిన ఆ ఐపీఎస్ అధికారి అసలు దళిత వర్గానికి చెందినవారే కాదని అసలు విషయం బయటపెట్టారు. దళిత వ్యతిరేకి బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్‌పైన అబద్ధాలతో బురద చల్లే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిందన్నారు. ప్రజలను మోసం చేసే ఈ తెలంగాణ ద్రోహులు.. దళిత వ్యతిరేకులైన బీఆర్ఎస్ నాయకుల కుట్ర రాజకీయాలను ప్రజలు సమూలంగా బొంద పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రస్తావించారు .

Related News

ఏ పార్టీలోకి వెళ్లేది లేదు.. వరంగల్ తూర్పు టికెట్ నాదే: క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ

మాట ఇస్తే తప్పను.. ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, రాజకీయ వాటా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రమత్తులో రైళులోనుండి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే?

ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

Big Stories

Advertisement
×