Noise Alt Clip open-ear earbuds: ప్రస్తుత కాలంలో ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీస్ వర్క్ చేస్తున్నా, వ్యాయామం చేస్తున్నా.. చెవుల్లో ఇయర్ బడ్స్ ఉండాల్సిందే. అయితే సాంప్రదాయ ఇయర్ బడ్స్‌ని చెవిలో లోపలికి పెట్టుకోవడం వల్ల ఎక్కువ సేపు వాడితే చెవి నరాలపై ఒత్తిడి పడి వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ ట్రెండ్‌ను మారుస్తూ, చెవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సరికొత్త ‘ఓపెన్-ఇయర్’ డిజైన్‌తో నాయిస్ బ్రాండ్ ‘Noise Alt Clip’ ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బడ్జెట్ ధరలో.. లభిస్తున్న ఈ గాడ్జెట్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ వీటి డిజైన్. వీటిని చెవిలో కుక్కాల్సిన అవసరం లేదు. చెవి వెనక భాగంలో క్లిప్ లాగా ఫిట్ అవుతాయి. దీని వల్ల పాటలు వింటూనే.. చుట్టూ జరిగే సౌండ్స్ కూడా స్పష్టంగా వినవచ్చు. రోడ్లపై వాకింగ్ లేదా రన్నింగ్ చేసే వారికి ఈ ఓపెన్-ఇయర్ డిజైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గంటల తరబడి చెవులకు ఎలాంటి నొప్పి లేకుండా దీన్ని వాడొచ్చు.
ఓపెన్-ఇయర్ ఇయర్ బడ్స్‌లో సౌండ్ క్వాలిటీ సరిగ్గా ఉండదనే.. అపోహ ఉంటుంది. కానీ నాయిస్ ఆల్ట్ క్లిప్ ఆ అపోహను పూర్తిగా పటాపంచలు చేసింది. ఇందులో హై-రెస్ ఎల్‌హెచ్‌డీసీ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల మ్యూజిక్ లవర్స్‌కి క్రిస్టల్ క్లియర్ సౌండ్, డీప్ బేస్ ఫీల్ లభిస్తుంది. ప్రతీ ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
ఎక్కడైనా రద్దీగా ఉండే ప్రదేశాల్లో కాల్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ డిస్టర్బ్ చేస్తుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఇందులో లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని వాడారు. దీని వల్ల మనం మాట్లాడేటప్పుడు చుట్టూ ఉన్న గాలి లేదా ట్రాఫిక్ శబ్దాలను ఏఐ ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేసి,ఎదురుగా ఉన్నవారికి మన గొంతును చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
Also Read: డేటా సేఫ్టీ అలర్ట్..ఈ పర్మిషన్స్ ఇస్తే మీ ఫోన్ హ్యాక్ కావడం ఖాయం!
రూ.3,999 బడ్జెట్‌లో లభించే ఈ ఇయర్ బడ్స్ బ్యాటరీ లైఫ్ పరంగా కూడా అదరగొట్టాయి. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజంతా వాడుకునేలా మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అలాగే.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల ఫోన్ లేదా ల్యాప్ టాప్‌కి క్షణాల్లో కనెక్ట్ అవుతుంది.వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటం వల్ల చెమట పట్టినా, వర్షంలో తడిచినా ఎలాంటి సమస్య ఉండదు.
చెవులకు ఎలాంటి హాని కలగకుండా.. హై-క్వాలిటీ మ్యూజిక్, కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఈ మోడల్ ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే.. వారు దీన్ని కొనొచ్చు.