Sangareddy : పగలైతే పంతులు, రాత్రి తాగుబోతు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఓ ప్రిన్సిపాల్ తాగుబోతు వ్యవహారం కలకలం రేపుతోంది. అదేదో అతని పర్సనల్ లైఫ్ అనుకుంటే సరే.. కానీ, ఈయన గారు ఏకంగా కాలేజీనే బార్‌గా మార్చేస్తున్నారు. జోగిపేట ప్రభుత్వ PG కాలేజ్ ఇంచార్జి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ అర్థరాత్రి అయితే చాలు స్నేహితులతో కాలేజ్‌లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇంకేముంది చదువుల నిలయంలో బార్ ఓపెన్ చేస్తున్నాడు. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ పూటుగా మద్యం తాగేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రవీణ్ మాత్రం ఆ ఫోటోలు తనవి కాదని.. తాను కాలేజీ భవనంలో మద్యం తాగలేదని బుకాయిస్తున్నాడు. ఫోటోలను మార్ఫింగ్ చేశారని చెబుతున్నాడు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. అబ్బో ఈయనో సెలబ్రిటీ.. అతని ఫోటోలు మార్ఫింగ్ చేశారా అని నిలదీస్తున్నారు. మరోవైపు ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటున్న ఇంచార్జి ప్రిన్సిపాల్ విద్యార్థులతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.