BigTV English

Sankranti Celebrations : పల్లె”టూర్”లో ముందే వచ్చిన సంక్రాంతి.. అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు

Sankranti Celebrations : పల్లె”టూర్”లో ముందే వచ్చిన సంక్రాంతి.. అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు

Sankranti Celebrations : తెలుగు రాష్ట్రాల్లో ఒకరోజు ముందే సంక్రాంతి వచ్చేసింది. ఇప్పటికే పట్టణాలు దాదాపు ఖాళీ అవ్వగా.. పల్లెటూర్లన్నీ పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. కొత్త అల్లుళ్లు, కోడళ్లతో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు మొదలు.. ఆట పాటలతో సంక్రాంతి సంబరాలను అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు.


సంక్రాంతి పండగకు అమ్మాయిలు అందంగా ముస్తాబయ్యారు. లంగాఓణీల్లో అందంగా సింగారించుకుని ఆనందంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందంగా రెడీ అయ్యి.. స్నేహితులతో కలసి మూడ్రోజుల పండగ జరుపుకుంటున్నారు. రంగవల్లుల సంక్రాంతిలో అమ్మాయిలదే హవా అంటే ఒప్పుకోక తప్పదు.

సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వేడుకల్లో చిన్నా-పెద్దా, యువతీయువకులు సందడి చేస్తున్నారు. కాలేజీలకు మోడ్రన్ డ్రస్సులతో వెళ్లే వారంతా పండుగ రోజు సాంప్రదాయ బట్టలు ధరించి.. పండుగ చేసుకుంటాన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పండుగు జరుపుకుంటున్నారు. నృత్యాలు, కోలాటాలతో ఆకట్టుకున్నారు. అందంగా అలంకరించిన ఎడ్లబండ్లను తోలుతూ ఉత్సాహం నింపుతున్నారు. ముగ్గులు వేస్తూ, పిండివంటలు చేస్తూ అలరిస్తున్నారు.


ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, గొబ్బిళ్లు, సంప్రదాయ దుస్తులతో సంక్రాంతి సంబరాలు సాగుతున్నాయి. తెలుగుదనం ఉట్టిపడేలా దుస్తులు ధరించిన అమ్మాయిలు.. తాము కూడా సాంప్రదాయాలను గౌరవిస్తామని చెబుతున్నారు. సిటీలో బిజీబిజీగా గడిపే తమకు ఇలాంటి పండుగలు ఆనందోత్సవాలను ఇస్తాయని చెప్పుకొస్తున్నారు. బోగి మంటలను ఏర్పాటు చేసిన అమ్మాయిలు.. దాని చుట్టూ చేరి గొబ్బెమ్మ పాటలు పాడుతున్నారు. హరిదాసు, గొబ్బెమ్మ వృషభాలు, గడ్డితో తయారు చేసిన పూరిపాకలను ప్రదర్శిస్తూ అదరహో అనిపిస్తున్నారు.

రాశి నుంచి మకరంలోకి ప్రవేశించే సమయంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సాధారణంగా ఏ పండుగ అయినా ఆ ఒక్కరోజే సంబరాలు జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ మాత్రం అన్ని పండుగలకూ భిన్నంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ.. రెండు వారాల ముందు నుంచే ప్రారంభమైంది. సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, కోడి పందేలు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, భోగి పళ్లు, గాలిపటాలు ఎగురేయడం వంటి ఎన్నో వేడుకలు జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పొంగల్, లోహ్రి అని విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలతో జరుపుకుంటారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×