BigTV English

Sankranti Gangiredlu : సంక్రాంతి ప్రత్యేకం.. డూడూ బసవన్నలు.. కనుమరుగవుతున్న సంప్రదాయాలు

Sankranti Gangiredlu : సంక్రాంతి ప్రత్యేకం.. డూడూ బసవన్నలు.. కనుమరుగవుతున్న సంప్రదాయాలు

Sankranti Gangiredlu : సంక్రాంతి అంటే పిండి వంటలు, రంగవల్లులు, హరిదాసులు, గొబ్బెమ్మలు, కోడిపందేలు, ఎడ్ల పోటీలే కాదు.. గంగిరెద్దుల సందడి కూడా. డూడూ బసవన్నల విన్యాసాలతో సందడిగా మారుతుంది. గంగిరెద్దుల ఆటలు లేనిదే సంక్రాంతి పరిపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. ఇంటింటికీ వచ్చి బసవన్నలు చేసే విన్యాసాలను పెద్దలు, పిల్లలను ఎంతగానో అలరిస్తాయి. అలాంటి గంగిరెద్దుల ఆడింటే వారి పరిస్థితి ఏంటి ?వాటిని ఎలా తయారు చేస్తారు ? తెలుసుకుందాం..


తెలుగురాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. పండుగలో కీలకంగా నిలిచే గంగిరెద్దుల ఆటంటే అందరికీ మక్కువే. గోదావరి జిల్లాల్లో జనవరి మాసంలో గంగిరెద్దులు కనిపిస్తాయి. పండుగ మూడ్రోజులు వాటి అలంకరణలు చూస్తే చూడ ముచ్చటగా ఉంటాయి. అసలు గంగిరెద్దులను ఎలా ముస్తాబు చేస్తారు. రంగురంగుల బట్టలు ధరించే వాటిని ఎలా పోషిస్తారన్న విషయాలు చాలా మందికి తెలియదు. ఈ జనరేషన్ కు అయితే.. వాటి గురించే తెలియదు.

కాలానుగుణంగా వస్తున్న మార్పులతో సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. హరిదాసులు, గంగిరెద్దులు చాలా అరుదుగానే కనిపిస్తున్నాయి. గంగిరెద్దులను ఆడించే కుటుంబాలు ఇతర ఉపాధిని వెతుక్కోవడంతో క్రమంగా ఈ సాంప్రదాయం కనుమరుగవుతోంది.


గతంలో తమ పరిస్థితులు చాలా బాగా ఉండేవని.. క్రమంగా వస్తున్న మార్పులతో జీవనోపాధి కూడా కష్టంగా మారిందని వీరు చెబుతున్నారు. వంశ ఆచారం ప్రకారం.. వీటిని పోషించుకుంటూ వస్తున్నామని.. ఆశించినంత మాత్రం ఆదాయం రావటం లేదని చెబుతున్నారు. తమ పోషణతో పాటు వీటిని చూసుకోవటం కష్టంగా మారుతుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరాలుగా ఇదే వృత్తిలో ఉంటున్న వీరికి.. జనవరిలో వచ్చే సంక్రాంతి రోజు మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. మిగిలిన సమయంలో వీరు.. ఇతర పనులకు వెళ్లటం ద్వారా జీవన ఉపాధి పొందుతారు. కానీ.. తమను నమ్ముకున్న జీవాలను మాత్రం చాలా ప్రాణంగా చూసుకుంటారు. ఏడాది కాలంలో ఆరుగాలంపాటు ఊరూర డూడూ బసవన్నలతో తిరుగుతూ.. దేశసంచారం చేస్తారు.

గంగిరెద్దులను తిప్పేవారిలోనూ 2 తెగలు ఉన్నాయి. ఒకరు పూర్తిగా గంగిరెద్దులపై జీవనం సాగిస్తే.. మరొక తెగ యక్షగాన కళాకారులు. తెలంగాణ ప్రాంతానికి వెళ్లి వీధి నాటకాలు ప్రదర్శించి వారిచ్చే సంభావనతో కుటుంబాలను పోషించుకుంటారు. మోటుపల్లి గ్రామంలో యక్షగాన కళాకారులున్నారు. వీరు ప్రదర్శించే కళలను చూసి.. యాదవులు మందకొక గొర్రె చొప్పున సంభావనగా ఇస్తారట. కానీ ఇప్పుడు.. టీవీలు, సినిమాలు రావడంతో.. ఇలాంటి కళారూపాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. తమ వృత్తిని పిల్లలకు నేర్పకపోవడంతో.. కళ అంతరించిపోతోంది.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×