Satyam Srirangam : బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడింది అధికార కాంగ్రెస్ పార్టీ. పదేళ్లలో మీరు చేసిన మోసాలు చాలు, ఇకనైనా మారాలని సూచన చేశారు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. కాంగ్రెస్ పాలనపై ప్రజలకు ఎంతో నమ్మకంతో ఉన్నారని చెప్పారు. గ్రామసభల్లో పోలీసులు రాజ్యమేలుతున్నారంటూ హరీష్‌రావు మాటలపై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ ముఖ్యమంత్రి పోలీసులు లేకుండా ఏనాడై గ్రామ సభలకు వచ్చారా? ఆయా సభలకు పోలీసులు లేకుండా వెళ్లారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ ఏ రోజైనా మంత్రులతో సమీక్ష చేశారా? ఏ మంత్రికి స్వేచ్ఛ లేకుండా పరిపాలన చేసిన విషయం మీకు గుర్తు లేదా అంటూ మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లాకు కేసీఆర్, హరీష్‌రావులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, పదేళ్లలో మీరెన్ని రేషన్ కార్డులు ఇచ్చారు? లబ్దిదారులు ఎన్ని ఇళ్లు అందుకున్నారు. పైగా ఇప్పుడు అలాంటి మాటలు ఆడటానికి సిగ్గుండాలన్నారు. రైతు బంధు పథకం భూ స్వాములకు, చెట్లకు, పుట్టలకు, రాళ్లకు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో 7 వేల మంది రైతులు చనిపోయింది నిజం కాదా? 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, ఈ ఏడాది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. గ్రామ సభలో పేర్లు లేనివాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని స్వయంగా మంత్రి చెప్పారని, హరీష్ రావు, కవితలు ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: మా బలం హైదరాబాద్, పక్క రాష్ట్రాలతో కాదు.. ఆ నగరాలతో మాత్రమే పోటీ: సీఎం రేవంత్
ఇదే క్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సూటిగా ప్రశ్నలు వేశారు. హౌసింగ్ బోర్డు స్థలాలను కాంగ్రెస్ కబ్జాలు చేస్తుందని చెప్పడంపై నోరువిప్పారు. హౌసింగ్ బోర్డు కాలనీలో వైన్ షాపులు పెట్టి డబ్బులు వసూలు చేసింది నిజం కాదా? కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. సింగపూర్, దావోస్ పర్యటనలో ఇప్పటివరకు సుమారు 70 వేల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.