CM Revanth Reddy: పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనేది తన లక్ష్యం కాదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ దేశాలతో పోటీ పడాలనే తన టార్గెట్ చెప్పుకొచ్చారు. దావోస్‌లో నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మా బలం హైదరాబాద్ సిటీ అని చెప్పుకొచ్చారు. అమరావతి మాత్రమే కాదు.. దేశంలోని ఏ మెట్రోపాలిటిన్ సిటీ.. హైదరాబాద్‌కు పోటీ కాదన్నారు. దేశానికి మధ్యలో హైదరాబాద్ ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీ నేషనల్ కంపెనీలను ఆకట్టుకోవాలన్నదే తమ కోరికగా చెప్పుకొచ్చారు.
గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ వంటి సెక్టార్లపై ప్రస్తుతం దృష్టి పెట్టినట్టు చెప్పుకొచ్చారు. పెట్టుబడులకు హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్‌గా వర్ణించారు. స్కిల్ వర్కర్స్, ఎడ్యుకేషన్‌లో రంగాల్లో తెలంగాణకు తిరుగులేదన్నారు. ఇక ఐటీ, ఫార్మా రంగాల్లో తిరుగులేదని ఇప్పటికే నిరూపించిందన్నారు. ఇంకా ఏమన్నారో ముఖ్యమంత్రి మాటల్లో ఓసారి విందాం.
బుధవారం ఒక్క రోజు 70 వేల కోట్లకు ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అందులో దేశీయ, విదేశీ కంపెనీలు సైతం ఉన్నాయి. లక్ష కోట్ల మార్క్ దాటాలన్నది ప్రభుత్వ ఆలోచన. అనుకున్నట్లుగా నాలుగింట మూడొంతులు ఒప్పందాలు జరిగాయి.
ALSO READ: గోపనపల్లిలో కొత్త ఐటీ సెంటర్, సీఎం రేవంత్‌తో చర్చలు
I don't want to compete with neighbouring states, I want to compete with New York, Tokyo, or Singapore
— CM Revanth Reddy"పక్క రాష్ట్రాలతో పోటీ పడడం నా లక్ష్యం కాదు, నేను న్యూయార్క్, టోక్యో లేదా సింగపూర్‌తో పోటీ పడలనుకుంటున్నాను."
— ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… pic.twitter.com/OaYs0S8bZt— Congress for Telangana (@Congress4TS) January 23, 2025