E-Paper
Advertisement

Panchayat Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం..! ఏ క్షణమైనా నోటిఫికేషన్ రిలీజ్

Panchayat Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం..! ఏ క్షణమైనా నోటిఫికేషన్ రిలీజ్
Advertisement

Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతున్నది. దాంట్లో భాగంగా ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో ఎస్‌ఈసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. 25న కేబినెట్ తర్వాత ఏక్షణమైనా నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. మొత్తం మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహిస్తారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు ప్రభుత్వం మొత్తం సిద్ధం చేస్తోంది. 2024 జనవరి 31న సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ, బీసీ రిజర్వేషన్లపై జీవో, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. బీసీలకు 42% కోటా పెంపు విషయం కోర్టులో ఉండటంతో, డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చాకే మార్పులు చేస్తారు.

Advertisement

SEC కీలక సమావేశం
నేడు SEC కమిషనర్‌లు, 33 జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, అబ్జర్వర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల స్థాపన, ఈవీఎంలు, భద్రతా ఏర్పాట్లు మొదలైన అంశాలపై చర్చించనున్నారు. SEC అధికారులు, “పక్కా ఏర్పాట్లు చేసి, పారదర్శకంగా ఎన్నికలు జరపాలి” అని సూచించారు. ఇటీవల నవంబర్ 20న సీఎస్, డీజీపీలతో కలిసి జిల్లా స్థాయి అధికారులతో భేటీ జరిగింది, ఇక్కడ ఓటర్ల జాబితాల్లో ‘మిస్ మ్యాపింగ్’ దోషాలు సరిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. జర్రంతా జాగ్రత్త..!

Advertisement

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు
SEC ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది. క్యాబినెట్ సమావేశం తర్వాత ఏక్షణమైనా నోటిఫికేషన్ జారీ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతలో జరిగే ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, బీసీ కోటా, కేటీఆర్ కేసు మొదలైన అంశాలు చర్చిస్తారు. ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఫలితాలు పోలింగ్ రోజే ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు, 5,817 MPTCలు, 538 ZPTCలకు ఎన్నికలు జరుగుతాయి. ఓటర్ల సంఖ్య సుమారు 3 కోట్లు.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×