BigTV English

Vande Bharat Express : తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు.. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య రెండో సర్వీసు..

Vande Bharat Express : తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు.. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య రెండో సర్వీసు..

Vande Bharat Express latest news


Vande Bharat Express latest news(Telugu news live today): తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ రైలు పట్టాలు ఎక్కేందుకు ఇప్పటికే రైల్వే బోర్డు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సర్వీసు సికింద్రాబాద్ – విశాఖ మధ్య నడవనుంది.

సికింద్రాబాద్ -వైజాగ్ మధ్య ఇప్పటికే ఒక వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. ఇందులో 16 బోగీలున్నాయి. 20833/20834 సర్వీసు నంబర్ తో ఈ రైలు సేవలు అందిస్తోంది. విశాఖ- సికింద్రాబాద్‌ తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను 2023 జనవరి 15 న ప్రారంభించారు. ఈ సర్వీసు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరుతోంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటోంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ లో ఈ రైలు బయలు దేరుతోంది. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు విశాఖకు చేరుకుంటోంది. ఈ సర్వీస్ లో ఆక్స్యుపెన్సీ వంద శాతం నమోదవుతోంది.


ఇప్పుడు సర్వీసు నంబర్ 20707/20708తో మరో రైలు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇందులో 8 బోగీలు మాత్రమే ఉంటాయి. త్వరలోనే ఈ సర్వీసు ప్రారంభించనున్నారు. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించనుంది. రెండో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రతి గురువారం సేవలు అందించదు. వారంలో మిగిలిన ఆరు రోజులు నడుస్తుంది.

Read More: తెల్ల రేషన్‌కార్డు ఉంటే చాలు.. బిల్లు కట్టకండి.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

ఉదయం 5 గంటల 5 నిమిషాలకు సికింద్రాబాద్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటా 50 నిమిషాలకు విశాఖకు చేరుతుంది. తెలంగాణలో వరంగల్ , ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. ఏపీలో విజయవాడ , రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. మళ్లీ మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు వైజాగ్ లో బయలు దేరుతుంది. రాత్రి 11 గంటల 20 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలోనే అవే స్టేషన్లలో ఆగనుంది. అంటే ఒకే సమయంలో అటు విశాఖ నుంచి, ఇటు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు సేవలు అందించనున్నాయి.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×