BigTV English

Operation Valentine OTT Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మెగా హీరో కొత్త సినిమా.. ఇంత తొందరగానా..?

Operation Valentine OTT Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మెగా హీరో కొత్త సినిమా.. ఇంత తొందరగానా..?


Operation Valentine OTT Date Announced: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీలో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది.

పుల్వామా దాడుల వంటి యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఫస్ట్ నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉండటంతో ప్రేక్షకాభిమానులు థియేటర్లకి పరుగులు తీశారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ లేకపోవడంతో డీలా పడిపోయారు.


అయితే థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌ప్రైమ్‌లో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఇప్పుడు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.

Read More: వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ థియేటర్లలో రిలీజైన 30 రోజుల తర్వాత ఓటీటీలోకి రానున్నట్లు ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

అందువల్ల ఈ మూవీ మార్చి రిలీజ్ అయింది. ఇప్పుడు మార్చి 29 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ తేదీ మిస్ అయితే.. ఏప్రిల్ మొదటి వారంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇప్పటి వరకు ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ రిలీజ్ గురించి ఏ ఒక్క అఫీషియల్ అప్డేట్ రాలేదు. కాగా తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చని.. కానీ హిందీలో మాత్రం 8 వారాల తర్వాత స్ట్రీమింగ్‌కి రానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే వరుణ్ తేజ్‌కు మంచి హిట్టు పడి చాలా కాలమే అయింది. అయినా వరుణ్ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా.. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టులతో కొత్త కొత్త జానర్‌లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Read More: ప్రపంచ అందాల సుందరిగా క్రిస్టినా పిస్కోవా.. భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారంటే

డిఫరెంట్ స్టోరీలతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఫిదా, తొలిప్రేమ సినిమాల తర్వాత మరొక హిట్టు పడలేదు. ఇక గతేడాది ఎన్నో ఆశల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గాండీవధారి అర్జున’ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. అయినా వరుణ్ తన ప్రయత్నం ఆపలేదు.

ఈ ఏడాది ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీతో వచ్చాడు. ఈ మూవీ కూడా భారీ అంచనాలతో తెరకెక్కగా.. బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించుకుంది. మరి వరుణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×