Sec to VJA: భారీ వర్షాలకు కాజీపేట్-విజయవాడ మధ్య దెబ్బతిన్న రైల్వేట్రాక్ పునరుద్దరణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ట్రయిల్ రన్ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం నుంచి సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అనుమతిస్తామన్నది అధికారుల మాట.
ఐదురోజుల కిందట భారీగా వచ్చిన వరదతో మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైలు పట్టాల కింద మట్టి, కంకరు కొట్టుకుపోయింది. రెండు చోట్ల 70 మీటర్ల చొప్పున ట్రాక్ కొట్టుకు పోయింది. దీంతో సికింద్రాబాద్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వెళ్లే రైళ్లను నిలిపి వేశారు.
ALSO READ: మునిగిన పంప్‌హౌస్.. అసలేం జరిగింది..?
ప్రత్యేకంగా మెటీరియన్‌ను దక్షిణ మధ్య రైల్వే అక్కడికి తరలించింది. అధికారులు దగ్గరుండి పనులు చేయించారు. పట్టాలు వేలాడుతున్న ప్రాంతంలో కింది బాగాన్ని బండరాళ్లు, కంకరతో నింపారు. పనులు పూర్తికావడంతో ప్రస్తుతం ట్రయిల్ రన్ నడుస్తోంది.
బుధవారం ఉదయం నాటికి ఒక ట్రాక్ మీదుగా రాకపోకలు సాగుతాయని అధికారులు చెబుతున్నారు. అదీ కూడా తక్కువ స్పీడ్ మాత్రమేనని అంటున్నారు. వర్షాలు పడడంతో ఆ ప్రాంతంలో భూమి మెత్తగా మారింది. ఈ క్రమంలో తక్కువ స్పీడ్‌లో రైళ్లు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ఆరు చోట్ల రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఒక్కో ప్రాంతంలో 100 మంది చొప్పున సుమారు 600 మంది కూలీలు పనులు చేశారు. కేవలం 36 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైల్వేశాఖ రికార్డు క్రియేట్ చేసింది. ఈ రూటులో ప్రతీరోజూ వందలాది రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. వరద నేపథ్యంలో ఈ మార్గంలో వెళ్లే రైళ్లను కొన్నింటిని దారి మళ్లించారు. పలు రైళ్లను రద్దు చేశారు.
Restoration works in full swing by SCR. All efforts are being taken up for restoration of train services in the Grand Trunk route section connecting North and South.@drmsecunderabad@drmvijayawada pic.twitter.com/8B1M7iRee8
— South Central Railway (@SCRailwayIndia) September 3, 2024