Seethakka: తెలంగాణ స్వేచ్ఛ, బ్యూరో: ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు మేము అనేక ప్రతిపాదనలు కేంద్రానికి పంపాము అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ పై రాష్ట్రాల మంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో సీతక్క పాల్గొని మాట్లాడుతూ.. సురక్షితమైన తాగునీరు లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థిరీకరించడం, దీర్ఘకాలం కొనసాగించేలా నిర్వహించడం అత్యంత అవసరం అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని, ప్రతి సంవత్సరం నిర్వహణ కోసం కూడా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహణ వ్యయాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అయినా, రాష్ట్రం అయినా తుది లక్ష్యం ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడం కావాలని, కలుషిత నీరు సరఫరా అయితే అనేక రకాల వ్యాధులు వ్యాపించి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అందువల్ల ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జల్ జీవన్ మిషన్ ను మరో రెండు సంవత్సరాలు పొడిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఉరుగ్వే – ఆస్ట్రియా జట్ల మధ్య జరిగిన మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్‌ను రాష్ట్ర మంత్రులు సీతక్క, అజారుద్దీన్ శుక్రవారం ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మంత్రి సీతక్క ఇరు జట్ల క్రీడాకారిణులను వ్యక్తిగతంగా పరిచయం చేసుకొని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని, ఈ పోటీలు అంతర్జాతీయ స్థాయిలో మహిళల హాకీ అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడల ద్వారా దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడతాయని సీతక్క పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఆధునిక క్రీడా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా పోటీలను తెలంగాణలో నిర్వహించడం ద్వారా రాష్ట్రం అంతర్జాతీయ క్రీడా పటంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోందని అన్నారు.మహిళా క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. క్రీడలు యువతకు ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని ఆమె అన్నారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలను రాష్ట్రంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలోని తొలి క్రీడ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఏ టీ జీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి, తెలంగాణ హాకీ అసోసియేషన్ సెక్రటరీ భీమ్ సింగ్, క్రీడా శాఖ అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు. తెలంగాణలో ఇలాంటి అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించడం రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్రాలు అమలు చేస్తున్న తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వం పంచుకోవాలని మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. నూతనంగా ఏర్పాటు అవుతున్న ఆవాసాలకు తాగు నీరు అందించేందుకు నూతనంగా ప్రాజెక్టులను టేకప్ చేస్తున్నాము. సోర్స్ పాయింట్ లో డ్రై అయినప్పుడు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నావు. లోకల్ సోర్స్ పాయింట్లను నిర్మిస్తున్నాము. దీనికి సంబంధించి కూడా కేంద్రం తన వంతు సహాయం చేయాలన్నారు. సీతక్క ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి..త్వరలో సమావేశం లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: Viral Video: వ్యూస్ కోసం వెర్రి వేషాలు.. స్కూటీ డిక్కీలో పసిపాప, ఈ కిలాడీ లేడీ చేసిన పని చూస్తే…?