BigTV English
Advertisement

Sheep Scam: గొర్రెల స్కాం కేసులో సంచలన విషయాలు.. ఏకంగా రూ.1000 కోట్ల స్కాం..!

Sheep Scam: గొర్రెల స్కాం కేసులో సంచలన విషయాలు.. ఏకంగా రూ.1000 కోట్ల స్కాం..!

Sheep Scam: బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న గొర్రెల పంపిణీ పథకంలో లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈడీ అధికారుల దర్యాప్తులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలో అమలు చేసిన ఈ స్కీంలో వెయ్యి కోట్లపైనే స్కాం జరిగినట్టుగా ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్టీగా పనిచేసి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కళ్యాణ్ ఇంటి నుంచి 200 బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను సీజ్ చేశారు.


గత ప్రభుత్వంలో గొర్రెల పథకంకు 4 వేల కోట్లు నిధులు విడుదల
కళ్యాణ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు బ్యాంక్ అకౌంట్లను కూడా సమకూర్చినట్టుగా కనుగొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కీంకు 4 వేల కోట్ల నిధులు విడుదల చేశారు. ఆ నిధులు కొట్టేసి ఎవరెవరు పంచుకున్నారన్న అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో ఏడు జిల్లాలో 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఉంది. ఈ కేసులో ఇప్పటికీ పరారీలో ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్‌లు పట్టుబడితే కేసులో మరిన్ని సంచలన వివరాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిధులు కొట్టేసి ఎవరెవరు పంచుకున్నారు అనే దానిపై దర్యాప్తు
2017లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా గొల్లకురుమల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని అనుకున్నారు. అందులోభాగంగా పథకానికి 12వేల కోట్ల రూపాయలను కేటాయించింది. 20 గొర్రెలు, ఒక పొట్టేల్తో కూడిన యూనిట్ ధరను లక్షా 25 రూపాయలుగా నిర్ణయించారు. ఈ రేటుకు గొర్రెల యూనిట్లు కొని పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ అతని కుమారుడు ఇక్రముద్దీన్‌లు ఎంట్రీ ఇచ్చిన తరువాత స్కీం స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు లక్షా 25 వేలుగా ఉన్న ఒక్కో యూనిట్ ధర ప్రభుత్వ ఆమోదం లేకుండానే లక్షా 75వేలకు పెరిగింది. గొర్రెల విక్రయందారుల నుంచి వాటిని కొని చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా తమ సొంత ఖాతాల్లోకి మళ్లిం చుకున్నారు.


700 కోట్ల రూపాయల అవినీతి..
ఏపీ పల్నాడుకు చెందిన ఏడుకొండలుతోపాటు మరికొందరు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నుంచి కొందరు ప్రభుత్వ అధికారులు, మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ కలిసి గొర్రెలు కొని ఇవ్వాల్సిన 21కోట్లు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టుగా అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ పథకంలోని కుంభకోణం తీగ కదిలింది. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. విచారణలో దాదాపు 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బయటపడింది. ఈ క్రమంలో పశునం వర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్‌తోపాటు ఈ స్కీంలో నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించిన పలువురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

Also Read: ఎంత కష్టం వచ్చిందో.. 17వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

8 చోట్ల ఏకకాలంలో దాడులు..
గోల్ మాల్ అయిన నిధుల్లో మనీలాండరింగ్ జరిగినట్టుగా అనుమానించిన ఈడీ.. కొంతకాలం క్రితం దీనిపై కేసులు నమోదు చేశారు. తాజాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న పశు సంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్, కళ్యాణ్ నివాసాలతోపాటు మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి విస్తృత స్థాయిలో సోదాలు జరిపారు. పలు రికార్డ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Related News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. దిగేసిన పందెం రాయుళ్లు, గెలుపు-మెజార్టీ-సెకండ్ ప్లేస్‌పై ఫోకస్

Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ తెరపైకి జనసేన.. టీడీపీ మౌనం కాంగ్రెస్ కి లాభమేనా?

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Say No to Drug: ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ.80 లక్షలు

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Jubilee Hills: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills By-election: ఈ నెల 11 లోపు కేసీఆర్, హరీష్ రావులను సీబీఐ అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Big Stories

×