HBD Sheela kaur:సాధారణంగా హీరోలతో పోల్చుకుంటే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకి లైఫ్ టైం చాలా తక్కువ. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే అవకాశాలు అందుకోవాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి మొదటి రెండు, మూడు సినిమాలు మంచి విజయం వరించినా.. ఆ తర్వాత ఎందుకో ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇండస్ట్రీలో సరైన సక్సెస్ లేక వైవాహిక బంధంలో సెటిల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి వచ్చి చేరింది ‘పరుగు’ బ్యూటీ షీలా కౌర్ (Sheela kaur)
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాతో భారీ క్రేజ్ కూడా సొంతం చేసుకుంది షీలా కౌర్. కానీ ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఇకపోతే ఈరోజు ఈమె పుట్టినరోజు కావడంతో ఈమె ఏమైంది? ఎక్కడుంది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరుగు సినిమాతో భారీ గుర్తింపు..
బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షీలా.. 2006లో నవదీప్ (Navadeep) హీరోగా వచ్చిన ‘సీతాకోక చిలుక’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాలలో నటించి తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈమె ధనంజయన్ , మమతా దంపతులకు ఆగస్టు 2 1996లో జన్మించింది. ఆ తర్వాత మంచు మనోజ్ (Manchu Manoj)తో రాజు భాయ్, సాయిరాం శంకర(Sairam Shankara) తో కలిసి హలో ప్రేమిస్తారా వంటి సినిమాలలో నటించింది. ఇకపోతే ఈమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు అని చెప్పాలి. ఇందులో మీనాక్షి అనే అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది.
హైపర్ సినిమాతో ఇండస్ట్రీకి దూరం..
ఈ సినిమా తర్వాత రామ్ (Ram ) తో మస్కా, బాలకృష్ణ (Balakrishna) తో పరమవీరచక్ర , ఎన్టీఆర్(NTR ) తో అదుర్స్ వంటి చిత్రాలు చేసింది. అయితే ఈ సినిమాలలో ఎక్కువగా గ్లామర్ రోల్స్ కే పరిమితం అయింది. దీంతో మళ్లీ అవకాశాలు లభించలేదు. చివరిగా 2018లో హైపర్ అనే కన్నడ సినిమాలో నటించి, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.
వ్యక్తిగత జీవితానికే పరిమితమైన షీలా కౌర్..
2020లో సంతోష్ రెడ్డి (Santhosh Reddy) ని వివాహం చేసుకున్న ఈమె.. ఇప్పుడు ఫ్యామిలీకి జీవితాన్ని కేటాయించింది. అటు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదని చెప్పవచ్చు. ఇక చాలా రోజుల తర్వాత తన కూతురు శివి తో కలసి ఫోటోలు షేర్ చేసింది. అటు భర్త , ఇటు పిల్లలను చూసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈరోజు షీలా బర్తడే కావడంతో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు అందరిలాగే ఈమె కూడా మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
ALSO READ:HBD Devi Sri Prasad: 42 ఏళ్ల వయసులో.. 21 ఏళ్ల సినీ కెరియర్లో.. డీఎస్పీ సంపాదించిన ఆస్తులు తెలిస్తే గుండె గుబేల్!