Telangana: మందుబాబులకు చుక్క పడందే మనసున పట్టదు. బాధ వచ్చినా సంతోషం వచ్చినా మద్యం ఉండాల్సిందే. కొంతమంది సరదా కోసం తాగితే మరికొంతమంది చేసిన కష్టాన్ని మర్చిపోవడానికి తాగుతుంటారు. మరికొందరు రోజూ తాగి చివరికి అలవాటైపోయి తాగుబోతులు అవుతుంటారు. రాబట్టి ప్రతిరోజూ ఎంత మద్యం అమ్ముడుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మిగితా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మద్యం అమ్మకాల్లో ముందుంటుంది. దసరా, న్యూయర్ లాంటి వేడుకల సమయంలో అయితే కోట్లల్లో అమ్మకాలు జరుగుతుంటాయి.
Also read: చంద్రబాబు ముందు పవన్ అసహనం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ..
ఆ సమయంలో సేల్స్ భారీగా ఉంటే మద్యం కొరత కూడా తలెత్తే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో మద్యం కొరత సాధారణమే కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం కొరత నెలకొనడం మందు బాబులను ఆందోళన కలిగిస్తోంది. మద్యం కొరతకు కారణం సరఫరా నిలిచిపోవడమేనట. సాంకేతిక సమస్య కారణంగా మద్యం సరఫరాకు అంతరాయం కలిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. సరఫరా నిలిచిపోవడంతో మద్యం డిపోల నుండి డీలర్లు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్ లైన్ ద్వారాగానే కొనసాగుతోంది. అయితే ఆన్ లైన్‌లో సమస్య తలెత్తడంతో సరఫరా నిలిచిపోయినట్టు సమాచారం. దీనిపై అధికారులను డీలర్లు ప్రశ్నించగా రాత్రి వరకు సర్వర్ల సమస్య తీరిపోతుందని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వైన్ షాపులకు తరచూ మద్యం సరఫరా జరుగుతూ ఉంటుంది. కానీ సరఫరా నిలిచిపోవడంతో డీలర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ సర్వర్ సమస్య తీరకపోతే పరిస్థితి ఏంటని కంగారు పడుతున్నారు.