Ways To Beat Air Fares: విమాన టికెట్ల ధరలు, బస్సు, రైలు టికెట్ల మాదిరిగా నిలకడగా ఉండవు. డిమాండ్ ను బట్టి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అప్పటికప్పుడు విమాన ప్రయాణం చేయాలనుకుంటే ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే ధరలు తక్కువగా ఉంటాయి. ప్రముఖ ట్రావెలింగ్ కంపెనీ థామస్ కుక్ డేటా ప్రకారం, ఈ ఏడాది మేలో ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-ముంబై వంటి ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీలు ఏకంగా 12.7 శాతం పెరిగాయి. విస్తారా విమానయాన సంస్థ దాదాపు 10 శాతం విమానాలను తగ్గించింది. టికెట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గో ఎయిర్ సైతం కొన్ని విమానాలను నిలిపివేసింది. ప్రాట్ & విట్నీ ఇంజిన్‌లలో సమస్యల కారణంగా 72 ఇండిగో ఎయిర్ బస్ A320 విమానాల సేవలను ఆపేసింది. స్పైస్ జెట్ సైతం విమాన సేవలను పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగాయి.
తక్కువ ధరలకే విమాన టికెట్లు ఎలా పొందాలంటే?
విమాన టికెట్లను తక్కువ ధరలకు పొందాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఇంతకీ అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ ప్రైవసీ మోడ్ లో టికెట్లు బుక్ చేయండి: ఆన్ లైన్ లో విమాన టికెట్లు బుక్ చేసేందుకు వీలైనంత వరకు ప్రైవసీ మోడ్ ని ఉపయోగించాలి. చాలా ఎయిర్ లైన్ వెబ్ సైట్లు కుక్కీలు, ఇంటర్నెట్ ప్రొటోకాల్ అడ్రెస్ ద్వారా సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేస్తాయి. ఒక వెబ్ సైట్ లో విమాన ధరను తనిఖీ చేసి, ఆ తర్వాత మళ్లీ తిరిగి వస్తే ఎక్కువ రేటు చూపించే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ప్రైవసీ మోడ్ లో టికెట్ల రేట్లను కంపార్ చేయాలి. ఆ తర్వాత కుక్కీలను క్లియర్ చేయాలి.
⦿ వారం మధ్యలో ప్రయాణించండి: వీకెండ్ లో సాధారణంగా ధరలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, వారం మధ్యలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. లేదంటే, పొద్దున, అర్థరాత్రి విమాన ప్రాణాయం చేస్తే టికెట్లు ధరలు తక్కువగా ఉంటాయి.
⦿ ఛార్జీల అలర్ట్స్ ఆన్ చేసుకోండి: విమాన టికెట్ల ధరల తగ్గింపు, ప్రత్యేక ఆఫర్ల గురించి తెలుసుకునేందుకు ట్రావెల్ బుకింగ్ ప్లాట్ ఫారమ్స్, ఎయిర్ లైన్ వెబ్ సైట్లలో అలర్ట్స్ సబ్ స్క్రయిబ్ చేసుకోవాలి. వాటి ద్వారా తక్కువ రేటు ఉన్న సమయంలో టికెట్లు బుక్ చేసుకోవాలి.
⦿ ఎయిర్‌లైన్ ప్రోగ్రామ్స్: ఎయిర్ లైన్స్ తరచుగా ఫ్లైయర్ మైల్స్ ప్రోగ్రామ్ లకు సభ్యత్వాన్ని తీసుకోవాలి. ఈ మెంబర్ షిప్ కారణంగా విమాన ఛార్జీలను తగ్గిస్తూ, రివార్డ్ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్లు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు తగ్గింపు ధరను అందిస్తాయి.
⦿ టికెట్ల ధరలను పోల్చి చూడండి: ఎప్పుడూ ఒక ఎయిర్ లైన్ టికెట్లను తీసుకోకూడదు. ఇతర ఎయిర్ లైన్స్ టికెట్ల ధరలను కంపార్ చేయాలి. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడ తీసుకోవాలి.
Read Also: మీ హనీమూన్.. ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే ఈ ప్లేసెస్‌కు వెళ్లాల్సిందే!