
Sharmila Latest News(Political News Telangana): తాలిబన్ల రాజ్యంగా తెలంగాణ తయారైందని.. పోలీసులను కుక్కలుగా, తొత్తులుగా కేసీఆర్ వాడుకుంటున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి భార్యను, బిడ్డను అవమానించిన కేసీఆర్.. ఇంతకుఇంత అనుభవిస్తారని హెచ్చరించారు. పోలీసులపై దాడి కేసులో బెయిల్ రావడంతో చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు వైఎస్ షర్మిల.
బోనులో పెట్టినా పులి పులేనని.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే అని షర్మిల సవాల్ చేశారు. గదిలో పెట్టి బంధిస్తే పిల్లి కూడా తిరగబడుతుందని.. పోలీసుల దాడితో సహనం నశించి, సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగానే తాను వారిపై దాడి చేశానని చెప్పుకొచ్చారు.
మగ పోలీసులు తన మీదమీదకు వచ్చి బెదిరించారని.. లేడీ కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వీడియో ఫూటేజ్ చూపించకుండా.. తాను కొట్టిన వీడియోలను మాత్రమే బయటకు వదిలారని విమర్శించారు. ఒక్కదానిపై అంతమంది దాడి చేస్తారా? మీకేమైనా సిగ్గు ఉందా? అంటూ ఖాకీలపై మండిపడ్డారు షర్మిల.
గతంలో హరీష్ రావు పోలీసులను కొట్టినా, కేటీఆర్ పోలీసులను తిట్టినా.. వారిపై కేసులు, అరెస్టులు ఉండవా? అని ప్రశ్నించారు.
Revanth Reddy : ఆ కంపెనీలపై ఐటీ దాడులు .. అందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్.. రేవంత్ హాట్ కామెంట్స్..