Big Stories

Sharmila : అవినీతి ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. ఆ ఎమ్మెల్యేకు షర్మిల సూటి ప్రశ్న..

Sharmila : బీఆర్‌ఎస్ నేతల పై YSRTP అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ప్రజల పక్షాన పోరాడటమే తమ తప్పా అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనపై దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కొత్త సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై షర్మిల అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడ మాక్ డ్రిల్ జరిగితే ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు.

- Advertisement -

టార్గెట్ ఎమ్మెల్యే..
అధికార పార్టీ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని షర్మిల ప్రశ్నించారు. తమ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని ఆరోపించారు. నిజాలను చెబితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడం లేదా? ఆయన ఏ1 కాంట్రాక్టర్ కాదా? అని ప్రశ్నించారు. ఆరూరి రమేష్ నిజాయితీపరుడైతే పబ్లిక్ ఫోరం మీటింగ్ పెట్టాలని సవాల్ చేశారు. అక్కడ ప్రజల అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. రైతులపై ఎమ్మెల్యే ఆరూరి రమేష్ థర్డ్ డిగ్రీ చేయించారని ఆరోపించారు. మందకృష్ణ భూమినే ఎమ్మెల్యే కబ్జా చేశారని తెలిపారు. ప్రజాసేవ చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదన్నారు.

- Advertisement -

సర్పంచ్ లకు నిధులేవి?

పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల కోసం ఏం చేశారని షర్మిల నిలదీశారు. అప్పులపాలై సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎర్రబెల్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సర్పంచులకు నిధులు అందించాల్సింది పోయి ఖాళీ బీరు సీసాలు అమ్మమంటారా అని మండిపడ్డారు.

తగ్గేదే లే..
బెదిరింపులకు, దాడులకు భయపడేదిలేదని షర్మిల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. శుక్రవారం జరిగిన దాడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News