India Squad for Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అలాగే ఇంగ్లాండ్ తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కి బరిలోకి దిగే 15 మందితో కూడిన ప్లేయర్ల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కాసేపటి క్రితమే ప్రకటించారు. ముంబై వంఖడే స్టేడియంలో సమావేశం అనంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీడియా సమావేశంలో ఈ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించారు.
Also Read: Actor Chiranjeevi: క్రికెట్ లో చిరంజీవి పెట్టుబడులు.. ఢిల్లీ కాపిటల్స్ తో కలిసి భారీ స్కెచ్ !
డాషింగ్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ కి ఈ జట్టులో చోటు కల్పించింది బీసీసీఐ. అంతేకాదు అతడికి ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు గిల్ వైస్ కెప్టెన్ గా అపాయింట్ అయ్యాడు. ఇక ఇంగ్లాండ్ తో జరగబోయే రెండు వన్డేల సిరీస్ కి బుమ్రా అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. అతని ఫిట్నెస్ అప్డేట్ కోసం వేచి చూస్తున్నామని.. అతడి స్థానంలో మొదటి రెండు వన్డేలకు హర్షిత్ రాణా ఆడతాడని పేర్కొన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పూర్తి భారత జట్టు: రోహిత్ శర్మ ( కెప్టెన్), శుభమన్ గిల్ ( వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, హర్షదీప్ సింగ్. ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం దొరకగా.. యంగ్ ప్లేయర్స్ కి మరోసారి నిరాశ ఎదురైంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన మహమ్మద్ షమీపై వేటు వేసింది బీసీసీఐ. అతడి స్థానంలో అర్షదీప్ సింగ్ కి అవకాశం కల్పించింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి కూడా నిరాశ ఎదురయింది. ఇక యశస్వి జైస్వాల్ కి తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. సంజు శ్యాంసన్ కి కూడా మొండి చెయ్యి చూపింది బీసీసీఐ.
Also Read: Harbhajan Singh: మొగుళ్లు తప్పు చేస్తే.. పెళ్లాలకు రూల్స్ ఎందుకు ? బీసీసీఐపై భజ్జీ ఫైర్ !
పేస్ బౌలర్ల విభాగంలో షమీతో పాటు అర్షదీప్ సింగ్ స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్ వేదికగా ఈ ఛాంపియర్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. అయితే భద్రతా కారణాల దృశ్య భారత జట్టు అక్కడికి వెళ్లకుండా.. తటస్థ వేదికైన దుబాయ్ లో తన మ్యాచ్ లను ఆడబోతోంది. ఈ టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్ నీ బంగ్లాదేశ్ తో ఆడబోతోంది. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20వ తేదీన ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది.