E-Paper
Advertisement

BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు ఎదురీత తప్పదా?

BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు ఎదురీత తప్పదా?
Advertisement

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురీత తప్పదని ప్రచారం జరుగుతోంది. ఎందుకుంటే ఆ పార్టీ పెద్దలు ఇంతవరకూ ప్రచారంలో పాల్గొనలేదు. కనీసం జిల్లా స్థాయి నేతలతో సమీక్షలు సైతం నిర్వహించడం లేదని తెలుస్తున్నది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ప్రకటన, స్టార్ క్యాంపెయినర్ల నియామకం, రెబల్స్ బెడద లేకుండా చూసుకునేందుకు నియోజకవర్గ స్థాయిలో ఇన్‌చార్జులను సైతం నియమించాయి. ఇక ప్రచారం సైతం ఇప్పటికే ప్రారంభించాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చూసే ఇన్ చార్జుల నియామకంతో పాటు అభ్యర్థుల ప్రకటనే సైతం ఆలస్యంగానే జరిగాయి.

మాజీ మంత్రులు ఎక్కడ?

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఉత్తర తెలంగాణలో బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తుండగా.. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచింది. ఎందుకంటే ఉత్తరంలో బీజేపీ బలంగా ఉండగా.. దక్షిణంలో కాంగ్రెస్‌కు బలమైన నేతలు ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బలం కలిగి, గత పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో వెనుకబడ్డారు. ఒక్క మేడ్చల్ జిల్లా పరిధిలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మినహా ఎవరూ ఎన్నికల ప్రచారంలో జాయిన్ కాలేదని టాక్. బీజేపీ, కాంగ్రెస్‌లో సీనియర్లు అంతా గ్రౌండ్ లో దిగినట్టు తెలుస్తున్నది. ఈనెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. అలాగే అమెరికా నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టగానే సీఎం రేవంత్..జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేశారు.

Advertisement

కానీ బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. వారంతా బీఆర్ఎస్ పెద్దలతోనే ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ పెద్దలు మాత్రం హైదరాబాద్ లోనే చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం. నిన్న కేసీఆర్‌ను సిట్ విచారించిన క్రమంలో ఆయనతో పాటే సంతోష్ రావు, కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రులు సైతం కనిపించారు. మరికొందరు బీఆర్ఎస్ భవన్‌లో పెద్దఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరంతా హైదరాబాద్‌లోనే ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించేది ఎవరు? అనే సందేహం ఇప్పుడు కేడర్‌లో కలుగుతోంది.

సర్పంచ్ ఫలితాలు రిపీటా?

పోయిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆశించిన దాని కంటే తక్కువ స్థానాలే వచ్చాయి. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు బుద్ది చెబుతారని బీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ,ఎవరూ ఊహించని విధంగా ప్రజలు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. కేవలం 30 నుంచి 40 శాతం సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ ఎలాగూ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. ఈ సారి కూడా కేటీఆర్, హరీశ్ రావులే మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. కృష్ణ జలాలపై కేసీఆర్ నిర్వహిస్తానన్న భారీ బహిరంగ సభలపైనా ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో గులాబీ సైన్యం తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నది. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఎక్కువ స్థానాలు గెలుస్తామని ముందే గ్రహించిన సీఎం.. అందుకే సిట్ విచారణల పేరిట తమను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేస్తున్నారని కేటీఆర్, హరీశ్ రావులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×