Malnadu Drugs Case: మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో బిగ్ బ్రేకింగ్. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ ఇంటెలిజన్స్ అడిషనల్ ఎస్పీ వేణుగోపాల్ రావు కుమారుడు రాహుల్ తేజను ఈగల్ టీం అరెస్టు చేసింది. నిజామాబాద్‌లో గత నెలలో దొరికిన డ్రగ్స్ కేసులోను అతన్ని సూత్రధారిగా భావిస్తున్నారు. మల్నాడు రెస్టారెంట్ ఓనర్‌తో పాటు, మరొకరితో కలిసి రాహుల్‌తేజ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్టు తర్వాత పోలీసులు ఆ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎస్ఐబీ అధికారి కొడుకు పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం ఈగల్ అధికారులను షాక్ కు గురి చేసింది. ఈ పోలీసు అధికారి కొడుకు పాత్ర పై ఆరా తీస్తున్న క్రమంలో మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. 2024 సంవత్సరంలో ఎస్ఐబీ అధికారి కొడుకు ఓ సారి దొరికినా పోలీసులు అతనిని అరెస్టు చేయకుండా జాప్యం చేశారనే విషయం కూడా ఈగల్ అధికారులు గుర్తించారు.
మల్నాడు కేసులో ఈగల్ అధికారులు సాంకేతికంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే అధికారులకు రాహుల్ తేజ గురించి తెలిసింది. అతని గురించి ఆరా తీసినప్పుడు 2024 జనవరిలో రాహూల్ తేజ పై నిజామాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో అతనిని ఏ3 నిందితుడిగా ఎఫ్ఐఆర్ చేశారు. కాని అతనిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. ఈ విషయంపై ఈగల్ అధికారులు ఆరా తీశారు.
Also Read: హైదరాబాద్ నడిరోడ్డుపై గన్‌తో కాల్చి.. కమ్యూనిస్ట్ నేత దారుణ హత్య
నిజామాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసులో మిగతా నిందితులను విచారించినప్పుడు తమకు రాహుల్ తేజ డ్రగ్స్ అందిస్తుండే వాడని తెలిసింది. వాటిని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ల నుంచి తీసుకువచ్చేవాడని వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ కేసులో నిజామాబాద్ పోలీసులు రాహూల్ తేజను ఎందుకు అరెస్టు చేయలేదని ఆరా తీసినప్పుడు అతని SIBలో రిటైర్ అయ్యి , ప్రస్తుత్తం ఓఎస్డీగా పని చేస్తున్న అధికారి కొడుకని తెలిసింది. దీంతో ఈగల్ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.