E-Paper
Advertisement

అర్ధరాత్రి కాల్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య!

అర్ధరాత్రి కాల్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య!
Advertisement

Singareni Employee: అర్ధరాత్రి వేళ వచ్చిన ఒక ఫోన్ కాల్ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నమ్మకంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ సింగరేణి ఉద్యోగిని దుండగులు అత్యంత కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని పవర్ హౌస్ కాలనీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే?

Advertisement

స్థానికంగా నివాసముంటున్న 30 ఏళ్ల అట్ల రాజశేఖర్ సింగరేణిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నవంబర్ 23వ తేదీ తెల్లవారుజామున సరిగ్గా 2 గంటల సమయంలో రాజశేఖర్ ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు బయటకు రావాలని పిలిచారు. ఏం జరుగుతుందో ఊహించని రాజశేఖర్ నిద్రమత్తులోనే ఇంటి బయటకు వచ్చాడు.

కత్తులతో విచక్షణారహిత దాడి

Advertisement

అప్పటికే అక్కడ నలుగురు యువకులు మాటువేసి ఉన్నారు. రాజశేఖర్ బయటకు రాగానే ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడ్డారు. అతను తేరుకుని తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికే విచక్షణారహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై రాజశేఖర్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

ఈ హత్యకు సంబంధించి భయానక దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. తెల్లవారుజామున తమ బిడ్డ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరారీలో ఉన్న ఆ నలుగురు దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also Read: స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు.. రూ.5 కోట్ల నగదు స్వాధీనం

Tags

Related News

స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు.. రూ.5 కోట్ల నగదు స్వాధీనం

నేడు కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ ఇదే?

ఇంటర్ బోర్డు రద్దు పై భగ్గుమంటున్న బీఆర్ఎస్.. అసలు కారణం అదేనా..?

మరో సారీ సత్తాచాటిన తెలంగాణ పోలీస్‌ బృందం.. ఏంచేసారంటే?

హైదరాబాద్ బాంబు బెదిరింపు పై.. క్లారిటీ ఇచ్చిన సీపీ మహేష్ భగవత్!

టీపీసీసీ భేటీలో మహేష్ కుమార్ గౌడ్ దత్తత పంచులు!

బట్టలు కాదు.. ఈ సారీ లాగులు కూడా ఊడదీస్తాం.. హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్!

Big Stories

Advertisement
×