E-Paper
Advertisement

మరో సారీ సత్తాచాటిన తెలంగాణ పోలీస్‌ బృందం.. ఏంచేసారంటే?

మరో సారీ సత్తాచాటిన తెలంగాణ పోలీస్‌ బృందం.. ఏంచేసారంటే?
Advertisement

Police Band: 27వ ఆల్ ఇండియా పోలీస్‌ బ్యాండ్‌ పోటీలు (2026–27)లో రజత పతకం సాధించిన తెలంగాణ పోలీస్‌ బిగిల్ బృందాన్ని డీజీపీ సీ.వీ.ఆనంద్‌ అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీస్‌ ప్రతిభను చాటడం గర్వకారణమన్నారు.

సీఆర్పీఎఫ్ గ్రూప్‌..

ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్ లోని సీఆర్పీఎఫ్ గ్రూప్‌ సెంటర్‌ లో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల, కేంద్ర పోలీస్ బలగాలకు చెందిన బ్యాండ్, బిగిల్ బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణ పోలీస్ బిగిల్‌, బ్యాండ్ బృందాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా చర్యలు చేపడతామని తెలిపారు.

పతకం సాధించిన వారు..

Advertisement

రజత పతకం సాధించిన వారిలో సంతోష్‌ (హెచ్సీ 1967), ఇంచార్జ్, కెప్టెన్, కె.స్వామి (హెచ్సీ 2562), వెంకటయ్య (హెచ్సీ 873), వెంకటస్వామి (హెచ్సీ 1427), భావన రుషి (హెచ్సీ 197), పీసీలు రామ్ లాల్‌ (పీసీ 3361), ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ (పీసీ 10250) బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ బెటాలియన్లు, పోలీస్‌ శిక్షణ సంస్థలు, హైదరాబాద్‌ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ లో పని చేస్తున్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐజీ డాక్టర్ గజరావు భూపాల్, స్పోర్ట్స్ డీఎస్పీ డాక్టర్ రామారావుతోపాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Also Read: జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి ఇంద్రజ అదిరిపోయే గిఫ్ట్.. నిజంగా గ్రేట్ అబ్బా..

Tags

Related News

హైదరాబాద్ బాంబు బెదిరింపు పై.. క్లారిటీ ఇచ్చిన సీపీ మహేష్ భగవత్!

టీపీసీసీ భేటీలో మహేష్ కుమార్ గౌడ్ దత్తత పంచులు!

బట్టలు కాదు.. ఈ సారీ లాగులు కూడా ఊడదీస్తాం.. హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్!

పెన్షన్ పేరుతో అత్త వేలిముద్రలు తీసుకుని.. ఇల్లు అమ్మేందుకు స్కెచ్చేసిన కోడలు

మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. టీపీసీసీ భేటీలో మంత్రి ఉత్తమ్ ధీమా!

హైదరాబాద్‌‌కు బాంబు బెదిరింపు కలకలం.. పోలీసులు హై అలర్ట్!

తగ్గేదేలే అంటున్న రాజగోపాల్ రెడ్డి.. నా ప్రయాణం, పోరాటం ఆగదు అంటూ కీలక పోస్ట్!

Big Stories

Advertisement
×