Revanth Reddy: హరీష్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు లోపలకి వచ్చి మా బట్టలు ఇప్పుడు కాదు.. అసెంబ్లీ ముందు మీ బట్టలు మీతో ఇప్పించినానని, అంగీలు కాదు ఈ సారి లాగు కూడా ఊడ పీకుతం అటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్గిపుట్టే దొరకని అగ్గిపెట్టే రావు ఈరోజు మనకు గుదిబండ లాగా అయిండని అన్నారు. అగ్గిపెట్టే దొరకని హరీష్ రావు మంత్రి అయిండు శ్రీకాంత చారి అమరుడు అయిండు గజ్వేల్‌కు వస్తా అని 2022 లో కేసీఆర్ కు చెప్పినని, కేసీఆర్ ను పామ్ హౌస్‌లో కూర్చో బెట్టి Trs ఇండ్లలో కూడా మనం ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు చేపట్టిన సమయంలో అనేక మంది పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను బలవంతంగా, అక్రమ కేసుల ద్వారా కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదు, మళ్లీ పెరగనివ్వకుండా అడ్డుకుంటానని కేసీఆర్ విర్రవీగాడు. నేను పీసీసీ అధ్యక్షుడిగా డిజిటల్ మెంబర్‌షిప్ చేపట్టి 90 రోజుల్లో 48 లక్షల మెంబర్‌షిప్ చేయించానని అన్నారు. దేశంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయించామని, ఆత్మవిశ్వాసాన్ని కేసీఆర్ దెబ్బతీసినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు విజయమో, వీర మరణమో అన్నట్లుగా సభ్యత్వం చేయించారని గుర్తు చేశారు.
Also read: జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి ఇంద్రజ అదిరిపోయే గిఫ్ట్.. నిజంగా గ్రేట్ అబ్బా..
అత్యధిక సభ్యత్వం చేయించిన ప్రతి ఒక్కరినీ రాహుల్ గాంధీని కలిపించి అభినందింపజేశామని, కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 92,35,833 ఓట్లు తెచ్చుకుని 64 సీట్లు గెలుచుకుంది.. ఒక సీటు సీపీఐ గెలిచిందని, 90 లక్షల ఓట్లు రావడం వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం పనిచేసిన అనేక మందికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నామని, అనేక మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకుల ఇళ్లకు పార్టీ బీ ఫామ్ పంపించామని అన్నారు.
ఆనాడు రాహుల్ గాంధీపై విశ్వాసంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి అయ్యారని, నారాయణఖేడ్ టికెట్‌ను సంజీవరెడ్డి కోసం వచ్చిన బీ ఫామ్‌ను సురేష్ షెట్కర్ వదులుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సురేష్ షెట్కర్‌ను పార్లమెంట్ సభ్యుడిని చేసింది. రాజకీయాల్లో అన్నాచెల్లెళ్లు కూడా ఇప్పుడు కొట్టుకుంటున్నారని, ఇప్పుడు అందరూ చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని నమ్మితే సొమ్ము అవుతుందని, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి పదవి చాలా గౌరవమైందని అన్నారు.
Also Read: ఆసియా కప్ మ్యాచ్ లో టాస్ వివాదం..టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ పాక్ విమర్శలు