E-Paper
Advertisement

నేడు కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ ఇదే?

నేడు కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ ఇదే?
Advertisement

BJP Padyatra: ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో భాగంగా ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం-అరాచకాన్ని అంతం చేద్దాం’ పేరిట దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో బీజేపీ జాతీయ నాయకత్వం మహా పాదయాత్ర ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం కరీంనగర్ కు రానున్నారు. నితిన్ నబీన్ తొలిసారి కరీంనగర్ రానున్న నేపథ్యంలో దాదాపు లక్ష మందితో మహా పాదయాత్ర నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేశారు.

లక్షకు మించి జనం..

గత రెండ్రోజుల నుంచి పార్టీ నేతలతో వరుస మీటింగ్ లు పెడుతూ జన సమీకరణ, పాదయాత్ర ఏర్పాట్లు, నగర అలకరణ, ఫ్లెక్సీల ఏర్పాటు వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. పాదయాత్ర స్థలికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించడంతోపాటు లక్షకు మించి జనం హాజరయ్యేలా బండి సంజయ్ కుమార్ కసరత్తు పూర్తి చేశారు. కరీంనగర్ ను తోరణాలు, జెండాలతో అందంగా అలంకరించారు. రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులతో నింపేశారు. నితిన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

వైశ్యా భవన్ వద్ద..

Advertisement

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నితిన్ నబీన్ కరీంనగర్ కు చేరుకుంటారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్ దిగిన వెంటనే నేరుగా గాంధీ బొమ్మ వద్ద నుంచి ప్రారంభమయ్యే మహా పాదయాత్రకు వస్తారు. వైశ్యా భవన్ వద్ద ప్రజా హోరును ఉద్దేశించి నితిన్ నబిన్ ప్రసంగించనున్నారు. ప్రసంగం ముగిసిన వెంటనే వైశ్యాభవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గడియారం సెంటర్, శాస్త్రీ రోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు ప్రజలతో కలిసి నితిన్ నబీన్ మహా పాదయాత్ర చేస్తారు. సాయంత్రం 4:30 గంటలకు తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుండి విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు.

కళాకారుల ఆట..

మరోవైపు నితిన్ నబీన్ కు వినూత్న రీతిలో స్వాగతం పలికేందుకు బండి సంజయ్ కుమార్ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కళాకారుల ఆట పాటలు, డప్పు నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. మహా పాదయాత్రలో ప్రముఖ రచయిత ఆకుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని కళా బ్రందం ప్రత్యేకంగా ఆట, పాటలతో అలరించేలా ఏర్పాట్లు చేశారు. మహా పాదయాత్రకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు యాత్ర పొడువునా రవాణా, మంచినీటి వసతి సౌకర్యాలను కల్పించారు. దాదాపు లక్షకు పైగా మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.

మహా పాదయాత్ర..

Advertisement

వివిధ సామాజిక సంస్థ, సంఘాల ఆధ్వర్యంలోనూ పాదయాత్ర పొడవునా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పాదయాత్ర చేసే వారికి నీళ్లు, మజ్జిగ, ఇతర తినుబండారాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్ఐఆర్ పేరుతో రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తూ దేశ ప్రతిష్టకు కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం-అరాచకాన్ని అంతం చేద్దాం’ పేరిట చేపడుతున్న 40 మహా పాదయాత్రల్లో కరీంనగర్ యాత్ర హైలైట్ గా నిలవనుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో వణుకు పుట్టేలా మహా పాదయాత్రను విజయవంతం కాబోతోందని పేర్కొన్నారు. లక్ష మందికి పైగా జనం పాల్గొనేలా దీనికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు వెయ్యికి పైగా బస్సులు, 500 మినీ బస్సులు, వ్యాన్లు, 2 వేల ఆటోలను సిద్ధం చేసినట్లు బండి సంజయ్ వీర్గీయులు చెబుతున్నారు.

Also read: తగ్గేదేలే అంటున్న రాజగోపాల్ రెడ్డి.. నా ప్రయాణం, పోరాటం ఆగదు అంటూ కీలక పోస్ట్!

Tags

Related News

ఇంటర్ బోర్డు రద్దు పై భగ్గుమంటున్న బీఆర్ఎస్.. అసలు కారణం అదేనా..?

మరో సారీ సత్తాచాటిన తెలంగాణ పోలీస్‌ బృందం.. ఏంచేసారంటే?

హైదరాబాద్ బాంబు బెదిరింపు పై.. క్లారిటీ ఇచ్చిన సీపీ మహేష్ భగవత్!

టీపీసీసీ భేటీలో మహేష్ కుమార్ గౌడ్ దత్తత పంచులు!

బట్టలు కాదు.. ఈ సారీ లాగులు కూడా ఊడదీస్తాం.. హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్!

పెన్షన్ పేరుతో అత్త వేలిముద్రలు తీసుకుని.. ఇల్లు అమ్మేందుకు స్కెచ్చేసిన కోడలు

మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. టీపీసీసీ భేటీలో మంత్రి ఉత్తమ్ ధీమా!

Big Stories

Advertisement
×