E-Paper
Advertisement

స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు.. రూ.5 కోట్ల నగదు స్వాధీనం

స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు.. రూ.5 కోట్ల నగదు స్వాధీనం
Advertisement

Sneha Group: తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ రంగంలో అగ్రగామిగా ఉన్న స్నేహ గ్రూప్‌కు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. సంస్థ కార్యకలాపాల్లో పన్ను ఎగవేత జరిగింది. దీంతో ఐటీ బృందాలు రంగంలోకి దిగాయి. వరుసగా రెండో రోజూ తనిఖీలు చేశాయి. ఈ మెరుపు దాడుల్లో ఇప్పటివరకు లెక్కల్లో చూపని రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

17 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

Advertisement

హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రధాన కార్యాలయంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 16 నుంచి 17 ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ప్రాసెసింగ్ ప్లాంట్లు, అనుబంధ ఆఫీసులతో పాటు డైరెక్టర్లు దెంది రామరెడ్డి, వరుణ్ రెడ్డి, స్నేహ దెంది నివాసాల్లోనూ అధికారులు అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.

క్యాష్ సేల్స్‌పైనే ప్రధాన అనుమానం

Advertisement

ప్రధానంగా చికెన్, కోడిగుడ్లు, పౌల్ట్రీ ఫీడ్ విక్రయాలకు సంబంధించిన నగదు లావాదేవీలపై అధికారులు కూపీ లాగుతున్నారు. భారీ ఎత్తున జరిగే ఈ ‘క్యాష్ సేల్స్’ను అధికారిక లెక్కల్లో చూపకుండా పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై విచారిస్తున్నారు. కేవలం పౌల్ట్రీ మాత్రమే కాకుండా, సంస్థకు చెందిన సఫల వంట నూనెల వ్యాపార లావాదేవీలతో పాటు, అనుబంధ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టిన భారీ పెట్టుబడుల చిట్టాను కూడా ఐటీ బృందాలు పరిశీలిస్తున్నాయి.

కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం..

ఈ దాడిలో పలు కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండో రోజూ సోదాలు కొనసాగుతుండటంతో.. ఈ తనిఖీల్లో ఇంకా ఎన్ని కోట్ల అక్రమ సంపాదన బయటపడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Also Read: తగ్గేదేలే అంటున్న రాజగోపాల్ రెడ్డి.. నా ప్రయాణం, పోరాటం ఆగదు అంటూ కీలక పోస్ట్!

Tags

Related News

నేడు కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ ఇదే?

ఇంటర్ బోర్డు రద్దు పై భగ్గుమంటున్న బీఆర్ఎస్.. అసలు కారణం అదేనా..?

మరో సారీ సత్తాచాటిన తెలంగాణ పోలీస్‌ బృందం.. ఏంచేసారంటే?

హైదరాబాద్ బాంబు బెదిరింపు పై.. క్లారిటీ ఇచ్చిన సీపీ మహేష్ భగవత్!

టీపీసీసీ భేటీలో మహేష్ కుమార్ గౌడ్ దత్తత పంచులు!

బట్టలు కాదు.. ఈ సారీ లాగులు కూడా ఊడదీస్తాం.. హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్!

పెన్షన్ పేరుతో అత్త వేలిముద్రలు తీసుకుని.. ఇల్లు అమ్మేందుకు స్కెచ్చేసిన కోడలు

Big Stories

Advertisement
×