BigTV English

Singireddy Niranjan Reddy: చెరువును మింగేసిన నిరంజన్ రెడ్డి.. నీళ్లు కనబడలేదా మహాశయా!

Singireddy Niranjan Reddy: చెరువును మింగేసిన నిరంజన్ రెడ్డి.. నీళ్లు కనబడలేదా మహాశయా!

ఇవన్నీ కాదు.. అసలు చెరువునే మాయం చేయడమేంటి బాసూ? అది బీఆర్ఎస్.. ఏమైనా మారుస్తుంది! ఎలాగోలా.. ఏమారుస్తుంది! వనపర్తిలోనూ.. జరిగిందిదే! ఓ బడా లీడర్ హుకుంతో.. ఏకంగా చెరువునే మాయం చేసేశారు. ఆ విషయం తెలియాలంటే.. ముందు ఈ వివరం తెలుసుకోవాలి.

ఇది.. 2023 మే 23న ఇచ్చిన జీవో. వనపర్తి శివార్లలో ఉన్న నాగవరంలోని మేళ్ల చెరువుని.. శిఖం భూమి నుంచి అయాన్ భూమిగా మారుస్తున్నట్లుగా ఇచ్చిన అప్పటి సర్కారు వారి ఆర్డర్ ఇది. సర్వే నెంబర్ 167లో 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మేళ్ల చెరువుని.. ప్రభుత్వ, ప్రజా అవసరాల నిమిత్తం.. శిఖం భూమి నుంచి కన్వర్షన్ చేస్తున్నట్లుగా.. జీవో జారీ చేశారు. అసలు.. మేళ్ల చెరువును.. శిఖం భూమి నుంచి అయాన్ భూమిగా ఎందుకు కన్వర్ట్ చేశారో తెలుసా? అప్పటి.. వనపర్తి ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి కోరుకున్నారు కాబట్టి. ఆ విషయాన్ని కూడా జీవోలోనే స్పష్టంగా రాశారు.


శిఖం భూమి కన్వర్షన్ కోసం నిరంజన్ రెడ్డి ఏం సూచించారంటే.. మేళ్ల చెరువు అనేది ఇప్పుడు. పనికిరాకుండా పోయింది. అందులో.. ఒకప్పటిలా నీళ్లు నిలవట్లేదు. చెరువు క్యాచ్‌మెంట్ ఏరియా అంతా.. ప్లాట్లుగా మారిపోయింది. దానివల్ల.. చెరువులోకి నీరు చేరడం లేదు. పైగా.. దానికింద ఎలాంటి ఆయకట్టు లేదు. ఈ చెరువు వల్ల భూగర్భ జలాలు కూడా పెరగడం లేదు. చివరికి.. పశువులు నీళ్లు తాగేందుకూ పనికిరావడంలేదు. కాబట్టి ఇక్కడ చెరువు ఉండడం వేస్ట్. వనపర్తిలో భవిష్యత్తులో ప్రజా అవసరాలకు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. అందుకని ఈ 4 ఎకరాల చెరువు భూమిని అయాన్ భూమిగా మార్చేస్తే అక్కడ కావల్సింది కట్టేసుకోవచ్చు. వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. ఆయన కోరుకోవడంతో వనపర్తి మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసేసింది. ఆ తర్వాత.. ఈ ఇష్యూని సీసీఎల్ఏకు పంపారు. అక్కడి నుంచి ఫైల్ కలెక్టర్‌కు చేరింది. మొత్తానికి.. అన్ని దశలు దాటి మేళ్ల చెరువు.. సాధారణ ప్రభుత్వ భూమిలా మారిపోయింది.

Also Read: 6 జంక్షన్లు.. 826 కోట్లు.. కేబీఆర్ పార్క్.. ఆపరేషన్ ఫ్లైఓవర్

మరి.. నిజంగానే మేళ్ల చెరువులో నీళ్లు నిలవడం లేదా? జీవోలో చెప్పినట్లుగా.. అక్కడ ప్లాట్లు ఏమైనా వెలిశాయా? ఇండ్లు ఏమైనా కట్టుకున్నారా? అర్బనైజేషన్‌తో క్యాచ్‌మెంట్ ఏరియా దెబ్బతిందా? అనే విషయాలను.. కొన్ని రోజుల క్రితమే బిగ్ టీవీ పరిశీలించింది. కానీ.. ఆ చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దగా నిర్మాణాలేవీ జరగలేదు. సరే.. మరి వర్షాకాలంలో ఈ ప్రాంతంలో పరిస్థితేంటని.. బిగ్ టీవీ మళ్లీ పరిశీలించింది. నీళ్లు నిలుస్తున్నాయా? లేదా? అనేది తెలుసుకునేందుకు వెళితే.. కనిపించిన సీన్ ఇది. విజువల్స్‌లో మీరు చాలా క్లియర్‌గా చూడొచ్చు. నీళ్లే లేవు.. ఎప్పటికీ రావు.. అంటూ ల్యాండ్‌ని కన్వర్ట్ చేస్తూ జీవో ఇచ్చిన ప్రాంతంలో.. మేళ్ల చెరువు సజీవంగానే ఉంది. నీటితో కళకళలాడుతోంది.

నిజానికి.. 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మేళ్ల చెరువు.. వనపర్తి టౌన్‌కు ఎంట్రన్స్‌లో ఉంది. దీని ఎదురుగానే.. ఆర్టీఏ ఆఫీసు కూడా ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. ఈ ఏరియాకు ఆ ప్రాంతంలో బాగా డిమాండ్ ఉంది. పైగా.. ఇళ్ల పక్కన ఇట్లాంటి ఒక వాటర్ బాడీ ఉంటే.. చూసేందుకు, అక్కడ నివసించే వాళ్లకు ఎంతో బాగుంటుంది. పైగా.. ఈ చెరువును.. ఓ మినీ ట్యాంక్ బండ్‌లా కూడా డెవలప్ చేయొచ్చు. గ్రౌండ్ వాటర్ పెరగడానికి కూడా పెరుగుతుంది. కానీ.. అవేవీ చేయకుండా.. చెరువునే మింగేయాలని చూశారు. ఇంత చక్కగా నీళ్లు నిలిచే మేళ్ల చెరువును.. ఎందుకు మాయం చేయాలనుకున్నారనేదే మేజర్ డౌట్? దీని వెనుక.. ఏమైనా కుట్ర దాగుందా? ఎవరి ప్రయోజనాల కోసం.. ఈ చెరువు శిఖం భూమిని కన్వర్షన్ చేశారు? ఈ వ్యవహారంలో.. నేరుగా ఆనాటి మంత్రిగారే.. జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇదంతా.. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏదైనా ఉండని.. అసలు ఓ చెరువునే మాయం చేయాలనే దారుణమైన ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనకున్న లోగుట్టు.. వనపర్తి ప్రజలకు కచ్చితంగా తెలియాలి.

Related News

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 26న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Big Stories

×