AP Politics: కూటమి సర్కార్, వైసీపీ పార్టీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. టూర్ల పేరుతో జగన్ బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మా పార్టీపై ఆంక్షలు ఎందుకు? జగన్ మాటేంటని సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు. మోదీకి దత్తపుత్రడని ఆయన్ని చూసీ చూడనట్టు వదిలేశారా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనని అన్నారు వైఎస్ షర్మిల. రాజధాని, స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై పోరాటం చేయాలని అనుకుంటే మిమ్మల్ని హౌస్ అరెస్టు చేశారని విమర్శించారు. గురువారం మధ్యాహ్నం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె, పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శన యాత్రలు చేస్తే ఆంక్షలు ఉండవా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చనిపోయిన వారికి ఎవరు బాధ్యుత వహిస్తారని నిలదీశారు. పోలీసులు 100 మందికి అనుమతి ఇస్తే.. వెయ్యికి పైగానే వచ్చారని అన్నారు. పోలీసులు, ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందలేదా? జగన్ వచ్చిన తర్వాత జనం వచ్చారా? ముందుగానే వచ్చారా? జగన్ రాకను ఎందుకు ఆపలేదన్నారు.
సమస్యలపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టు చేస్తారా? ఈ విషయంలో జగన్‌కు ఎలాంటి ఆంక్షలు ఉండవా? ప్రధాని మోదీని దత్తపుత్రుడని, జగన్ ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటు న్నారా? ఇద్దరు ప్రాణాలు తీసినా చెల్లుతుందా? మరణించినవారి కుటుంబాలకు జగన్, సీఎం చంద్రబాబు, పోలీసులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నలు లేవనెత్తారు.
ALSO READ: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ఆల్ ఫ్రీ.. ఫ్రీ
బెట్టింగ్‌లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వారికి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటిని ప్రారంభించడానికి పార్టీ అధినేత జగన్ అక్కడకు వెళ్లడం ఏంటి? సమాజం ఎటు పోతోంది? ఎటు తీసుకెళ్తున్నారని జగన్ని నిలదీశారు. ఒక నాయకుడిగా జగన్ ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని, లేకుంటే చంద్రబాబు సర్కార్‌ని నిలదీయాలి?
ఈ బల ప్రదర్శనలు దేనికని కడిగేశారు. సూపర్ సిక్స్ ఏమైంది? రాజధాని, పోలవరం, వైజాగ్ స్టీల్ విషయంలో అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము జగన్ లేదన్నారు. ఇలా బలప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారంటూ రుసరుసలాడారు?
వైఎస్ జగన్ మోదీకి దత్తపుత్రుడు అనే ఆంక్షలు పెట్టడం లేదా?: వైఎస్ షర్మిల
ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్‌కి మాత్రమే ఎందుకు ఆంక్షలు?
బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్నవాళ్లకు జగన్ పరామర్శ ఏంటి?
జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవో చంద్రబాబు సమాధానం చెప్పాలి
– పీసీసీ… pic.twitter.com/FPSRkGrVWM
— BIG TV Breaking News (@bigtvtelugu) June 19, 2025