E-Paper
Advertisement

CM Revanth Reddy Challenges | తొలి వంద రోజుల్లో గ్యారెంటీల అమలు.. సిఎంగా రేవంత్ రెడ్డికి సవాల్

CM Revanth Reddy Challenges | తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు ఎప్పుడూ నిలిచిపోయేదే. అయితే అది ఘనంగా చెప్పుకునేలా పాలించాల్సిన పరిస్థితి. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎలా చెబుతారో మళ్లీ అదే స్థాయి గుర్తింపు పాలన ఇవ్వాల్సిన టాస్క్ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంది. దాన్ని నిలబెట్టుకుంటూనే అన్నిటినీ సమన్వయం చేయాల్సిన పరిస్థితి.

CM Revanth Reddy Challenges | తొలి వంద రోజుల్లో గ్యారెంటీల అమలు.. సిఎంగా రేవంత్ రెడ్డికి సవాల్

CM Revanth Reddy Challenges | తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు ఎప్పుడూ నిలిచిపోయేదే. అయితే అది ఘనంగా చెప్పుకునేలా పాలించాల్సిన పరిస్థితి. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎలా చెబుతారో మళ్లీ అదే స్థాయి గుర్తింపు పాలన ఇవ్వాల్సిన టాస్క్ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంది. దాన్ని నిలబెట్టుకుంటూనే అన్నిటినీ సమన్వయం చేయాల్సిన పరిస్థితి.

సీఎం రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు చాలా టాస్కులు ఉన్నాయి. తన మంత్రివర్గ సహచరుల్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వారితో సమన్వయం చేసుకుంటూనే పాలన సాగించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కేసీఆర్ తర్వాత తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినా.. కాంగ్రెస్ హయాంలో తొలి సీఎంగా రికార్డు సృష్టించారు. ఎంతో మంది సీనియర్లను కాదని రేవంత్ కు సీఎం పదవి దక్కింది. ఇది అవకాశంగా కాకుండా.. ఓ సవాల్ గా తీసుకున్నారు రేవంత్.

తెలంగాణ తొలి కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రికార్డు ఎప్పటికీ ఉంటుంది. అది ఘనంగా చెప్పుకునేలా పాలించాల్సిన పరిస్థితి సీఎం రేవంత్ ముందున్న విషయం. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు ఎందరు ఉన్నా.. వైఎస్ఆర్ పేరు మాత్రం ఇప్పటికీ మార్మోగుతుంటుంది. సమకాలీన రాజకీయాల్లో ప్రస్తావనకు వస్తుంది. ఆయన తెచ్చిన పథకాలన్నీ హైలెట్ అయ్యాయి. ప్రతి పేదింటి వరకు చేరాయి. అవసరాలు తీర్చాయి. అందుకే వైఎస్ హయాం వెలిగిపోయింది. ఇప్పుడు తాజా సీఎం రేవంత్ రెడ్డి ముందు కూడా అలాంటి పరిస్థితే ఉంది. ముందు నుంచే రేవంత్ చాలా విజన్ తో ఉన్న నాయకుడు. ఇప్పుడు తన మనసులో ఉన్న తన మార్క్ పథకాలను ముందు ముందు తెరపైకి తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

సీఎం రేవంత్ వస్తూనే… అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి అంటూ తన స్టాండ్ చెప్పుకొచ్చారు. అందరికీ సమాన అభివృద్ధి అన్నారు. అదే టాప్ ప్రయారిటీ అని చెప్పకనే చెప్పారు.

సీఎంగా రేవంత్ రెడ్డికి పాలనలో తొలి వంద రోజులు చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఆరు గ్యారెంటీల అమలు జరగాలి. రాష్ట్ర ఆదాయం పెరగాలి. ఇప్పటికే తెచ్చిన అప్పులకు కాళేశ్వరం అప్పులకు పెద్ద ఎత్తున వడ్డీలు కట్టాలి. అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన సాగాలి. ఇతర పథకాల అమలు, ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం.. ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. విద్యుత్ కోతల్లేకుండా చూసుకోవడం, హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, హైదరాబాద్‌లో ఐటీ పురోగతి మందగించడం కూడా చూడటం కూడా ముఖ్యమే.

కేసీఆర్ పాలనలో రేవంత్ కొన్ని లోపాలను క్లియర్ గా అబ్జర్వ్ చేశారు. కేంద్రం చాలా పథకాల్లో గ్రాంట్ లు ఇస్తుంటుంది. వాటిని కేసీఆర్ సర్కార్ సరిగా వినియోగించుకోకపోవడంతోనే సమస్యలు పెరిగాయని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటి గ్రాంట్లను చాలా జాగ్రత్తగా వాడే అవకాశం ఉంది. నిజానికి గత కేసీఆర్ సర్కార్ కొన్నేళ్లు పాటు తెలంగాణ సెంటిమెంట్ నే నమ్ముకుని రాజకీయాలు చేసింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ కు కూడా కేసీఆర్ వ్యతిరేక ప్రసంగాలు ఎక్కువ రోజులు ఉపయోగపడవు. తమ మార్క్ ఉండాల్సిందే. అప్పుడే ప్రజాభిమానం కంటిన్యూ అవుతుంది. ఈ విషయం రేవంత్ కు బాగా తెలుసు.

కాంగ్రెస్ కు అసలు పరీక్ష తెలంగాణలో గెలవడంతో పూర్తవలేదు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలంటే మార్పు కనిపించాలి. అలా చేయడం ఎలానో సీఎం రేవంత్ కు తెలుసు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×