 
					Konda Surekha vs Errabelli Swarna: వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ తగ్గేదేలే అంటున్నారు. అధిష్టానం ఆగ్రహించిన, పీసీసీ క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని వివరించిన ఓరుగల్లులో కొండా సురేఖా ఆధిపత్యపోరులో వెనకడుగు వేసేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
వరంగల్ తూర్పు నియోజక వర్గంలో మిగతా కాంగ్రెస్ నేతల జోక్యాన్ని కొండా సురేఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ వర్సెస్ మంత్రి కొండా సురేఖ అన్నట్లుగా తయారు అయింది.
మాజీ ప్రధానీ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ కాశీబుగ్గలోని ఆమె విగ్రహానికి మంత్రి కొండా సురేఖ నివాళులు అర్పించారు. అయితే ఈ సమయంలో కొండా సురేఖ కంటే ముందు ఇందిరా గాంధీ విగ్రహానికి డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అయితే ఆసమయంలో అక్కడే ఉన్న కొండా సురేఖ ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను తీసివేయాలని అనుచరులను ఆదేశించారు.
అనంతరం తాను ప్రత్యేక పూలమాలను ఇందిరాగాంధీ విగ్రహం మెడలో వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కొండా సురేఖ తీరును చూసి ఎర్రబెల్లి స్వర్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read: రాజస్థాన్‌లో ఒప్పు.. తెలంగాణలో తప్పా? అజాహరుద్దీన్‌కు మంత్రి పదవిపై ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సంఘటనతో వరంగల్ కాంగ్రెస్‌లో ఉన్న సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణ మధ్య విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. గత కొద్ది నెలలుగా ఈ ఇద్దరి మధ్య స్థానిక రాజకీయాల్లో ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. తాజాగా ఈ వర్ధంతి వేడుక మరోసారి ఆజ్యం పోసినట్లయింది. మాజీ ప్రధాని వర్ధంతిని నేతలు వేర్వేరుగా నిర్వహించడంపై.. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.