TPCC Chief Mahesh Kumar goud Commens: తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మహేష్ కుమార్ గౌడ్ కు మాజీ ఎంపీ వి.హనుమంతరావు అధ్యక్షతన గురువారం రవీంద్రభారతిలో రాష్ట్ర ఓబీసీ సంఘాలచే ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను. ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాలకు ధీటుగా కుల గణన జరగాలని.. దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని భారత్ జోడో నుంచి చాటుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ. అందుకే ఆయనను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నేను రాహుల్ గాంధీ బాణాన్ని.. సోనియా గాంధీ పంపిన సందేశాన్ని, మల్లికార్జున ఖర్గే పంపిన సైన్యాన్ని నేను. బీసీల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నన్ను ఒక ధ్యేయంతో పీసీసీని చేశారు. వారు కోరిన విధంగా ముందుకు పోవాలని తపన పడుతున్నాను. రాహుల్ గాంధీ చెప్పినట్టు జిస్కి జిత్ని అబాధి, ఉస్కి ఉత్ని బాగేదారి.
Also Read: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?
గత పాలకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు 42 శాతం నుండి 23 శాతంకు తగ్గించారు. బీఆర్ఎస్ నేతలు ముందు వీటికి సమాధానం చెప్పాలి. దమ్ముంటే ఒక బీసీ బిడ్డను మీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా చేసే దమ్ము ఉందా? బీజేపీ అధ్యక్షుడిగా యాక్టీవ్ గా పనిచేసే బీసీ బిడ్డా అయిన బండి సంజయ్ ని ఎందుకు తొలగించారు.? రెండు క్యాబినెట్ లలో సంజయ్ కి సహాయ మంత్రి పదవే ఎందుకు ఇచ్చారు..?
పార్టీలో పొన్నం ప్రభాకర్, వీహెచ్ లాంటి వారు ఎందరో బీసీల కోసం కొట్లడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను నాతో చదివించారు..సెన్సిటీవ్ విషయాల్లో ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా వాటిని అందులో పొందుపరిచారు. అది రేవంత్ కమిట్మెంట్.
రాహుల్ గాంధీ ఆలోచన ఈ దేశంలో అందరికీ సమానత్వం కావాలి. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్న సందర్భం అద్భుతం. రేవంత్ రెడ్డి, నేను, పొన్నం ప్రభాకర్ అంతా రాహుల్ గాంధీ సైనికులం. బీసీ కుల గణన జరగనిదే ఎన్నికలకు పోవొద్దని చర్చిస్తున్నాం. బీసీ కుల గణన అనేది కాంగ్రెస్ పేటెంట్. బీసీ కుల గణనపై బీజేపీ, బీఆర్ఎస్ లకు మాట్లాడే అర్హత లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంతా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపండి. రాహుల్ గాంధీ ఈ దేశానికి మంచి భవిష్యత్. నిరాడంబరుడు, నిష్కలమశుడు రాహుల్ గాంధీ. పీసీసీ చీఫ్ గా నా పేరును పరిశీలిస్తున్న సమయంలో పొన్నం ప్రభాకర్ పేరు వినిపించింది. కానీ పొన్నం ప్రభాకర్, దీపా దాస్ మున్షీ ఆ పదవికి మహేష్ కుమార్ గౌడ్ అర్హుడు అని చెప్పారు’ అంటూ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.