BigTV English

SLBC Tunnel Tragedy : టన్నెల్లో చిక్కుకున్న 8 మంది పరిస్థితేంటి.? రాడార్ ద్వారా ఏం గుర్తించారు?

SLBC Tunnel Tragedy : టన్నెల్లో చిక్కుకున్న 8 మంది పరిస్థితేంటి.? రాడార్ ద్వారా ఏం గుర్తించారు?

SLBC Tunnel Tragedy : ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు జాడ కోసం ప్రయత్నిస్తున్న అధికారులకు ఆశలు సన్నగిల్లుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఎనిమిది రోజులు దాటుతుండడం.. ఇంకా పూర్తి స్థాయిలో మిషన్ దగ్గరకు చేరుకునే పరిస్థితులు లేకపోవడంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంలో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే.. రోజు, రోజుకు తీవ్రతరం చేస్తున్న గాలింపు చర్యల్లో కీలక పురోగతి సాధించినట్లు చెబుతున్నారు. హై ఫ్రిక్వెన్సీ రాడార్ ల సాయంతో చేపట్టిన గాలింపు చర్యల్లో కార్మికులకు సంబంధించిన సమాచారం అందినట్లుగా ప్రచారం సాగుతోంది.


గ్రౌండ్ పినిట్రేటింగ్ రాడార్ (ground penetrating radar) సాంకేతికతతో చేపట్టిన గాలింపులో.. ప్రమాధ స్థలంలో రాడార్ కొన్ని అనుమానాస్పద స్పాట్లను గుర్తించినట్లుగా చెబుతున్నారు. అంటే..పూర్తి మట్టి, రాళ్లు, ఇనుప వస్తువులతో నిండిపోయిన ఆ స్థలంలో కొన్ని చోట్ల మొత్తని వస్తువుల ఆచూకీ కనిపించినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రాడార్ సిగ్నళ్లను బట్టి ఆయా ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తులు పెట్టుకున్న సహాయక సిబ్బంది.. తొలిత అక్కడి నుంచే బురద, నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాడార్ సిగ్నళ్లను బట్టి.. బుదర నీటిలో దాదాపు 3 మీటర్ల లోతులో మొత్తని వస్తువు/ పదార్థాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ సిగ్నళ్లు.. కఠినమైన పదార్థాలు, మొత్తని, మృధువైన పదార్థాల్లో వేరువేరు సిగ్నళ్లను ప్రసారం చేస్తుంటుంది. వాటిని డిజిటల్ తెరపై స్పష్టంగా వెల్లడిస్తుంటుంది. అలా.. ప్రమాద స్థలంలో మొత్తం ఐదు చోట్ల మొత్తని పదార్థాల ఆనవాళ్లు గుర్తించగా.. అవి కార్మికుల శరీరాలు కావచ్చని భావిస్తున్నారు. అయితే.. రాడార్ల సిగ్నళ్లను బట్టి ఇప్పుడే  స్పష్టత ఇవ్వలేమంటున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో నిర్ధరణ అయిన తర్వాతే ఏ విషయమైనది చెబుతామంటున్నారు.


కాగా.. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇంజినీర్లు సహా మరో నలుగురు కార్మికులు తప్పిపోయారు. వారింకా.. మిషన్ ముందు భాగంలో సజీవంగానే ఉండి ఉంటారనే ఆశాభావంతో గాలింపు చర్యలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఎనిమిది రోజులుగా సాగుతున్న సహాయక చర్యాల్లో శుక్రవారం, ఫిబ్రవరి 28న  అత్యాధునిక రాడార్లు, పరికరాలతో గాలింపు చేపట్టగా.. టన్నెల్లో చిక్కుకున్న వారంతా బురదలో ఉన్నట్లు సంకేతాలు అందాయి.

ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన  ప్రాంతంలోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు, మంత్రులు.. నిత్యం మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.

కలెక్టర్ ఏమన్నారంటే.?

టన్నెళ్లో చిక్కుకుని పోయిన కార్మికులు సజీవ సమాధి అవుతున్నారనే ప్రచారం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ స్పందించారు. ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ పూర్తి స్పష్టమైన సమాచారం లేనిదే అలాంటి వార్తల్ని పంచుకోవద్దని కోరారు. కార్మికుల కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతోందని, వారి ఆచూకీ ప్రస్తుతానికి ఇంకా లభించలేదన్నారు. ఏదైనా సమాచారం అందితే.. సంబంధిత శాఖల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచించారు.

 

 

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×