Aishwarya Rajesh: హీరో, హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో చాలా కమర్షియల్‌గా ఉంటారని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. వాళ్లు రెమ్యునరేషన్ లేకుండా ఏమీ చేయరని అంటుంటారు. కానీ కొందరు నటీనటులు అలా కాదు. అలా పారితోషికం విషయంలో తను ఎలా మోసపోయాననే విషయాన్ని తాజాగా బయటపెట్టింది ఐశ్వర్య రాజేశ్. కానీ ఆ విషయాన్ని తను నవ్వుతూ చెప్పింది. తాజాగా ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘శబ్దం’ మూవీ ప్రమోషన్స్‌లో ఐశ్వర్య కూడా పాల్గొంది. సినిమాలో తను భాగం కాకపోయినా ప్రమోషన్స్‌లో మాత్రం మూవీ టీమ్‌తో కలిసి సందడి చేసింది. అందులోనే తనకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఒక యాక్టర్ హ్యాండ్ ఇచ్చాడనే విషయం రివీల్ చేసింది.
వడ్డీతో లక్షలు
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా నటించిన ‘శబ్దం’ (Sabdham)లో లక్ష్మి మీనన్ హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు లైలా, సిమ్రాన్ లాంటి సీనియర్ నటీమణులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. తాజాగా ఐశ్వర్య రాజేశ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆదితో పాటు లైలా, యాక్టర్ రెడిన్ కింగ్స్‌లే (Redin Kingsley), డైరెక్టర్ అరివరగన్ వెంకటాచలం పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో రెడిన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది ఐశ్వర్య రాజేశ్. తనతో కలిసి ఒక షోలో చేసినందుకు రూ.5 వేలు రెమ్యునరేషన్ ఇవ్వాలని, అది ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ నవ్వుకున్నారు. అయితే అలా చేయకూడదని, రెమ్యునరేషన్ ఇచ్చేయాలని ఐశ్వర్యకే సపోర్ట్ చేశాడు ఆది.
మోస్ట్ వాంటెడ్ కమెడియన్
అప్పట్లో ఆ రెమ్యునరేషన్ రూ.5 వేలు అని, ఇప్పుడు అది వడ్డీతో కలిపి రూ.5 లక్షలు అయ్యిందని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh). దానికి రెడిన్ మాత్రం ఏమీ మాట్లాడకపోయినా.. అలా చేయడం కరెక్ట్ కాదంటూ అందరూ ఐశ్వర్యకే సపోర్ట్ చేశారు. మొత్తానికి తను చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్‌లో కమెడియన్‌గా ఉన్నా కూడా గత మూడేళ్లలోనే రెడిన్‌కు ఎక్కువగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘డాక్టర్’ మూవీతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు రెడిన్. అలాగే తనకు తెలుగులో కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది.
Also Read: ఇప్పటికీ అదే అందం.. వేడి వేడి పేడనే తన సీక్రెట్ అంటున్న లైలా..
తెలుగు డెబ్యూ
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీతో తెలుగులో అడుగుపెట్టాడు రెడిన్ కింగ్స్‌లే. ఆ మూవీలో పోస్ట్‌మ్యాన్ పాత్రలో కనిపించి మరోసారి కామెడి పండించాడు. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘శబ్దం’ అనేది హారర్ కామెడీ మూవీనే అయినా అందులో కూడా రెడిన్ తనవంతు కామెడీ చేశాడు. తాజాగా విడుదలయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఇప్పటికే దర్శకుడు అరివారగన్ వెంకటాచలం, ఆది కాంబినేషన్‌లో ‘వైశాలి’ అనే మూవీ వచ్చింది. అప్పట్లో ఆ సినిమా హారర్ జోనర్‌లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే కేటగిరిలో ‘శబ్దం’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు.