BigTV English
Advertisement

KA Paul: వైసీపీపై మనసుపడ్డ కేఏ పాల్.. ఆ కామెంట్స్ అందుకేనా?

KA Paul: వైసీపీపై మనసుపడ్డ కేఏ పాల్.. ఆ కామెంట్స్ అందుకేనా?

KA Paul: వైసీపీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్  మనస్సులో ఏదో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న కేఏ పాల్ తరచూ టీడీపీ, జనసేన లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వైసీపీని ఉద్దేశించి సాఫ్ట్ కార్నర్ లో మాట్లాడుతున్నారన్న టాక్ నడుస్తోంది. దీనితో కేఏ పాల్ మనసులో వైసీపీని అక్కున చేర్చుకోవాలన్న కోరిక ఉన్నట్లేనంటూ ప్రచారం ఊపందుకుంది.


ప్రజాశాంతి పార్టీని స్థాపించిన సమయం నుండి కేఏ పాల్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులను రంగంలోకి దించిన కేఏ పాల్.. ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోయారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించగానే, తన పార్టీలో విలీనం చేస్తే సీఎం చేస్తానంటూ పాల్ హామీ ఇచ్చారు. కానీ పాల్ మాటలు పవన్ కు చేరాయో లేదో కానీ ప్రజాశాంతి పార్టీ వైపు జనసేన చూడలేదు. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా.. పాల్ ప్రజల పక్షాన తన వాణి వినిపిస్తున్నారు.

పాల్ మీడియా సమావేశం నిర్వహిస్తే, అన్నీ సంచలన కామెంట్స్ కావడంతో సోషల్ మీడియాలో పాల్ కు క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఇటీవల పాల్ నిర్వహించే మీడియా సమావేశాలలో వైసీపీకి అనుకూలంగా పాల్ ప్రకటనలు చేయడం విశేషం. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్ మాట్లాడుతూ.. జగన్ , వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలని, జగన్ అసెంబ్లీకి వెళితే ప్రతిపక్షం అనేది ఉంటుందన్నారు. ఇక్కడే పవన్ లక్ష్యంగా మాత్రం పాల్ ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నారని, కానీ పవన్ ఒక మాటపై ఉండడం లేదంటూ విమర్శించారు. అలాగే వేస్ట్ ఫెలో అంటూ పవన్ ను ఉద్దేశించి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.


ఇక ఏపీ బడ్జెట్ పై మాట్లాడిన పాల్.. ఏపీకి రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంటే రూ.13 లక్షల కోట్లు అని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. మోదీ నగదు బదిలీ అనేది ఒక నాటకమని, ఉత్తర భారత దేశంలో ఎంపీల స్థానాలు పెంచి , దక్షిణ భారత దేశంలో ఎంపీ స్థానాలు తగ్గిస్తున్నారన్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషాలు లేకుండా చేయాలని మోడీ చూస్తున్నారన్నారు. ఇందిరా గాంధీకి 400 ఎంపీ స్థానాలు ఉన్న సమయంలో, తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారని, ఇందిరాకు ఎదురు నిలిచి పోరాడారని కొనియాడారు. ఏపీలో తల్లికి వందనం లేదు.. బడ్జెట్లో మహిళలకు, నిరుద్యోగులకు ఏం నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రానికి 10 లక్షల అప్పు ఉందని చంద్రబాబుకి ముందు తెలియదా అంటూ పాల్ ప్రశ్నించారు. చంద్రబాబు తన మాట వింటే, రూ. 4 వేలు కాదు నెలకు రూ. 5 వేలు పెన్షన్ ఇచ్చే డబ్బులు చూపిస్తానంటూ పాల్ చెప్పుకొచ్చారు.

Also Read: చంద్రబాబు కష్టాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వంశీ, పోసాని? వెళ్లిన 2 రోజులకే!

ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంలో ఎప్పుడూ ముందుండే పాల్.. ఇటీవల ప్రతి మీడియా సమావేశంలో వైసీపీపై సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు పవన్ ను టార్గెట్ చేస్తున్నారని, అలాగే కూటమి ప్రభుత్వంపై పాల్ విరుచుకుపడుతున్నారని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీపై పాల్ మనసులో ఏదో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద తన దారి రహదారి అనే కేఏ పాల్.. అంతరంగంలో ఏముందో ఎవరికి ఎరుక.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×