BigTV English

Smita Sabharwal: వివాదంలో స్మితా సభర్వాల్.. నోటీసులు ఇచ్చేందుకు అంతా రెడీ!

Smita Sabharwal: వివాదంలో స్మితా సభర్వాల్.. నోటీసులు ఇచ్చేందుకు అంతా రెడీ!

Smita Sabharwal: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ కొత్త వివాదాలు మొదలయ్యాయి. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ రెడీ అవుతోంది. ఇన్నోవా కారు అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని అందులోని సారాంశం. ఇంతకీ నిధులేంటి? తిరిగి చెల్లించడం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.


అసలేం జరిగింది?

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌ను అద్దె కారు వివాదం చుట్టుముట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటికీ తన కారు అద్దె చెల్లింపు బిల్లులు పంపి డ్రా చేసుకున్నారని ఆడిట్‌లో తేలింది. కారుకు అద్దె పేరుతో యూనివర్శిటీ నుంచి రూ.61 లక్షల రూపాయలు బిల్లులు పెట్టి వసూలు చేసుకోవడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇటీవల వర్శిటీలో నిధుల దుర్విని యోగం, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఈ విచారణలో స్మితా సభర్వాల్ కు రూ.61 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు అధికారులు.


ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో పని చేశారు ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్. ఆ సమయంలో 2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు నెలకు రూ.63 వేల చొప్పున కారుకు అద్దె రూపంలో యూనివర్సిటీ నుంచి నిధులు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు దాదాపు రూ.61 లక్షలు తీసుకోవడాన్ని ఆడిట్‌ విభాగం అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్మితా సభర్వాల్ తీసుకున్న కారు టీఎస్‌ 08 ఈసీ 6345 వాహనం నాన్‌ టాక్స్‌ కాదు. ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదు. ఈ వాహనం ప్రైవేటు వ్యక్తిగత వాహనం. పవన్‌కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో తేలింది. సీఎంవో ఉన్న సమయంలో స్మితా సభర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావడంతో వర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తేల్చింది.

ALSO READ: వర్షాలొచ్చేస్తున్నాయి.. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్

వర్సిటీ వర్గాలు ఏమన్నాయి?

ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పని తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇటీవల జరిపిన విచారణలో కొన్ని అవకతవకలు జరిగినట్టు తేలాయి. అందులో స్మిత సబర్వాల్ అద్దె కారు వ్యవహారం కూడా ఉంది. స్మితా సభర్వాల్‌ వాహనం అద్దెపై ఆడిట్‌ అభ్యంతరం చేయడం నిజమేనని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తెలిపారు.

ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ జరిపించామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని విశ్వవిద్యాలయం పాలకవర్గం దృష్టికి వచ్చిందన్నారు. సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం, న్యాయ నిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నాయి.

తెలంగాణ టూరిజం శాఖ బాధ్యతలను చూస్తున్నారు స్మితా సబర్వాల్. హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో అద్దె కారు వివాదం రావడంతో ఆమెకు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతుందో చూడాలి. అన్నట్లు దీనిపై ఐఏఎస్ అధికారి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×