BigTV English

Sonia Gandhi: మీ ధైర్యం, సంకల్పమే తెలంగాణ ఇవ్వాలన్న ప్రేరణ నాలో కలిగించింది : సోనియా గాంధీ

Sonia Gandhi: మీ ధైర్యం, సంకల్పమే తెలంగాణ ఇవ్వాలన్న ప్రేరణ నాలో కలిగించింది : సోనియా గాంధీ

Sonia Gandhi Formation Day Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని సోనియా విడుదల చేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల త్యాగాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.” తెలంగాణ సోదర సోదరిమణులందరికీ నమస్కారం రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందకీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ప్రత్యేక రాష్ట్ర కల సాకారాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని 2004లోనే కరీంనగర్ లో హామీ ఇచ్చానప్పుడు.. నేను ఇచ్చిన వాగ్దానంతో మా పార్టీలో అసమ్మతి చెలరేగింది. చాలా మంది నేతలు కూడా పార్టీని వీడారు.

Also Read: తెలంగాణ అవతరణ దినోత్సవం, దశాబ్దం గడిచిందంటూ కేటీఆర్ ట్వీట్


మీ ధైర్యం, సంకల్పం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి తీరాలనే శక్తి సాహసాలు, ప్రేరణ నాలో కలిగించాయి. పదేళ్లు  మీరంతా నాపై ఎంతో వాత్సల్యం, ప్రేమ చూపించారు. ప్రజల కలల్ని సాకారం చేయడం మా బాధ్యత. ప్రత్యేక రాష్ట్ర అవతరణ శుభ సమయంలో మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తుంది. తెలంగాణ ప్రగతి ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాననంటూ సోనియా గాంధీ వీడియో సందేశంలో తెలిపారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×