Big Stories

BJP: భార్యలు కాదు వీరనారులు.. వారెవా కాషాయ సివంగిలు..

bandi etela wifes

BJP: మహిళలు కాస్త సున్నిత మనస్కులు. చిన్నచిన్న వాటికే బెదిరిపోతుంటారు. గొడమీద బల్లి కనిపించినా.. బొద్దింక వచ్చినా.. బెంబేలెత్తిపోతుంటారు కొందరు. కానీ, అందరూ అలా ఉండరు. అనేకమంది వీరనారులను మనం తరుచూ చూస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకంటే…

- Advertisement -

అసలే తల్లి పోయిన బాధ. పుట్టెడు దుఃఖంలో ఉందామో. అంతలోనే భర్త ఇంటికొచ్చారు. ఆయనతో బాధను పంచుకుంటుండగా.. అర్థరాత్రి సడెన్‌గా పదుల సంఖ్యలో పోలీసులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారు. వచ్చీ రాగానే.. భర్తను అమాంతం ఎత్తుకెళ్లారు. అభిమానులు అడ్డుకుంటున్నా పోలీసులు ఆగలేదు. రౌడీలను, ఉగ్రవాదులను ఈడ్చుకెళ్లినట్టు ఆమె భర్తను తీసుకెళ్లారు.

- Advertisement -

మామూలు మహిళైతే ఆ భీతావాహ పరిస్థితికి బెదిరిపోయేవారేమో.. నిలువునా వణికిపోయేవారేమో.. గుక్కపెట్టి ఏడ్చేవారేమో. కానీ, ఆమె బెదరలేదు. అదరలేదు. పైగా మరింత ధృడంగా మారారు. తన భర్త అరెస్ట్‌పై గొంతెత్తి ప్రశ్నించారు. కాలర్ పట్టుకోకుండానే పోలీసులను, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఆమె మరెవరో కాదు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సతీమణి అపర్ణ.

అవును, బండి సంజయ్ అరెస్ట్ ఎంత సంచలనంగా మారిందో.. భర్త అరెస్ట్‌పై సంజయ్ భార్య అపర్ణ గొంతెత్తిన విధానమూ అంతే ఆసక్తిగా మారింది. బండిని పోలీసులు తీసుకెళ్లినప్పటి నుంచే ఆమె వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. పోలీసులు సంజయ్‌తో దారుణంగా ప్రవర్తించడం.. మూడునాలుగు జిల్లాలు తిప్పుతూ వేధనకు గురి చేయడంపై.. అపర్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమెకున్న ఏకైకా ఆప్షన్ మీడియానే. అందుకే, పలు టీవీ ఛానెళ్లతో వరుసగా మాట్లాడుతూ వచ్చారు. బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా తప్పుబట్టారు.

ఎవరో పేపర్ లీక్ చేస్తే.. బండి సంజయ్‌కి ఏంటి సంబంధం? ఇదీ అపర్ణ సంధించిన ప్రశ్న. సంజయ్ ఏమైనా ఉగ్రవాదా? కనీసం అన్నం కూడా తిననీయకుండా.. ఉన్నపళంగా అలా ఎత్తుకెళతారా?.. అపర్ణ చేసిన ఈ విమర్శ ఖాకీలకు సూటిగానే తగిలింది. పోలీసులకు ‘బలగం’ సినిమా చూపిస్తే బాగుండేదని.. అలాగైనా వారికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ అర్థమయ్యేవంటూ ఖతర్నాక్ కామెంట్ చేశారామె.

శనివారం సికింద్రాబాద్‌లో మోదీ సభ ఉండగా.. సంజయ్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారని.. ఆ సభకు ఆటంకం కలిగించేందుకే ఆయన్ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆమె రాజకీయ నాయకురాలు కాకపోయినా.. ఇలా పొలిటికల్ యాంగిల్‌ లేవనెత్తడం విశేషం.

కేవలం మాటలకే పరిమితం కాలేదు అపర్ణ. జైలుకెళ్లి భర్త బండి సంజయ్‌ను కలిశారు. భార్యగా తనవంతు మనోధైర్యం నింపారు. సంజయ్ సైతం అపర్ణకు ధీమా కలిగించారు. జైల్లో భర్తను కలిసి వచ్చిన బండి అపర్ణలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. తాము ఎలాంటి కేసులకైనా భయపడబోమని అపర్ణ సవాల్ చేశారు. పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని తేల్చి చెప్పారు. అపర్ణ ధైర్యాన్ని చూసి కమలనాథులే ఆశ్చర్యపోతున్నారు. బండికి తగ్గ భార్య అంటూ అభినందిస్తున్నారు.

సేమ్ టు సేమ్ ఇలాంటి పరిణామమే గతంలో మరొకటి చూశాం. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ను ఫుల్‌గా కార్నర్ చేసింది అధికార పార్టీ. ఆయనపై భూకబ్జా కేసులు మోపారు. ఆయన అనుచరులను బెదిరించారు. ప్రలోభపెట్టారు. సామ దాన భేద దండోపాయాలతో హుజురాబాద్‌లో ఈటలను ఏకాకిని చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ సమయంలో రాజేందర్‌కు అందరికంటే ఎక్కువగా దన్నుగా నిలిచింది ఆయన అర్థాంగి జముననే. “ఆస్తులన్నీ అమ్మైనా సరే.. కేసీఆర్‌ను గట్టిగా ఎదుర్కోవాల్సిందే” అంటూ జముననే ఈటల రాజేందర్‌కు మరింత స్పూర్తి రగిలించారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో అంతాతానై వ్యవహరించారు జమున. నియోజకవర్గాన్ని రెండు భాగాలుగా విభజించుకుని.. ఓవైపు రాజేందర్.. మరోవైపు జమున.. పగలురాత్రి తేడా లేకుండా ప్రచారంలో కష్టపడ్డారు. చివరకు అందమైన విజయాన్ని ఆస్వాదించారు. ఆనాడు భార్య జమున మద్దతే తనకు లేకపోయుంటే.. తాను అంతలా పోరాడగలిగే వాడిని కాదంటూ.. ఈటల రాజేందరే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. స్వతహాగా వారిద్దరికి నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్ ఉండటం.. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన అనుభవం తోడవడంతో.. హుజురాబాద్‌లో కేసీఆర్ బలప్రదర్శనను బలంగా నిలవరించగలిగారు.

ఆ తర్వాత మునుగోడు బైపోల్ ప్రచారం సమయంలోనూ మరో సంఘటన. జమున స్వగ్రామంలో ఈటల ప్రచారం నిర్వహిస్తుండగా.. సడెన్‌గా బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. రాజేందర్ కారును అడ్డుకుని ధ్వంసం చేశారు. అయినా, ఆ జంట ఏమాత్రం భయపడలేదు. పోరాట స్పూర్తిలో రాజేందర్ రాజేందరే.. జమున జమునే.

బండి సంజయ్ భార్య అపర్ణ.. జమునలా ప్రజాపోరాటాల్లో రాటుదేలిన మహిళ కాదు. బండి సంజయ్ చేసిన పోరాటాలను చూసే మనోబలం పెంచుకున్నారు. అందుకే, అర్థరాత్రి పోలీసులు దాడి చేసి భర్తను పట్టుకెళ్లినా.. పరేషాన్ కాకుండా పట్టుదలగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. జైల్లో బండి ఇచ్చిన మెసేజ్‌ను కార్యకర్తల వరకూ చేర్చి.. భర్తకు తగ్గ భార్య అనిపించుకుంటున్నారు. అందుకే, వారెవా వీరనారులు. మీకు సలాములు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News