BigTV English

Road Accident: కేబుల్ బ్రిడ్జీపై ప్రమాదం.. ఇద్దరు యువకులు కిందపడి దుర్మరణం

Road Accident: కేబుల్ బ్రిడ్జీపై ప్రమాదం.. ఇద్దరు యువకులు కిందపడి దుర్మరణం

Cable Bridge: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్లుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఇద్దరు యువకులు బ్రిడ్జీ పై నుంచి కిందపడిపోయి స్పాట్‌లోనే మరణించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు.


ఇదిలా ఉండగా రాయదుర్గంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎర్రగడ్డ నుంచి మోయినాబాద్‌కు వెళ్లుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Also Read: అందరూ ఆల్ రౌండర్లే: భారత కోచ్ సాయిరాజ్


గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ ఫ్లైఓవర్ పైనా ఇలాగే బైక్ యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బైక్ పై వెళ్లుతుండగా ఆ బండి ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్ తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత్, ఉద్యోగం వెతుకుతూ వచ్చిన బాల ప్రసన్నలుగా మృతులను గుర్తించారు. మసీద్ బండ నుంచి హఫీజ్ పేట్‌కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×