BigTV English

Street Dogs Attack on Buffalo : దడ పుట్టిస్తున్న వీధి కుక్కలు.. గేదెపై మూకుమ్మడి దాడి..

Street Dogs Attack on Buffalo : దడ పుట్టిస్తున్న వీధి కుక్కలు.. గేదెపై మూకుమ్మడి దాడి..
This image has an empty alt attribute; its file name is 8287c4be16a8381a308d8d924ff49e0d-65a360268013c.jpg

Street Dogs Attack on Buffalo : కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కల సంచారం రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లలతో పాటు.. పెద్దలు సైతం రోడ్లపై ఒంటరిగా వెళ్లాలంటే జంకుతున్నారు. ఒంటరిగా వెళ్లే వ్యక్తులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లో ముగ్గురు చిన్నారులు, ఓ వృద్దుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.


తాజాగా పశువులపై కూడా దాడి చేస్తున్నాయి. ఇలాంటి ఓ సంఘటన కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో చోటుచేసుకుంది. గేదెపై వీధ కుక్కలు దాడి చేసిన ఘటన జిల్లాలో ప్రజలను కలవర పెడుతోంది. గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కలు విపరీతంగా పెరిగాయి. రోడ్లపై గుంపులు గుంపులుగా సంచారం చేస్తూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

ఇరుకుల్ల గ్రామానికి చెందిన సంకరి కనకయ్య తన గేదెలను వ్యవసాయ బావి వద్ద కట్టేసి రాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూసే సరికి వీధి కుక్కలు గేదె‌పై పడి మూకుమ్మడిగా దాడి చేశాయి. గమనించిన కనకయ్య కర్ర సహాయంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. కుక్కలు తనపై దాడి చేసేందుకు యత్నించడంతో అక్కడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వాదా సమాచారం అందించాడు.


దీంతో కుటుంబ సభ్యులు పెద్ద కర్రలతో వ్యవసాయ బావి వద్దకు చేరుకుని కుక్కలను కొట్ట‌డంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వీధి కుక్కల దాడిలో గేదెకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానిక పశు వైద్యుడు డాక్టర్ రామకృష్ణ‌కు కుటుంబ సభ్యులు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు చికిత్స చేసి గేదె ప్రాణాలను కాపాడారు.

Tags

Related News

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

Big Stories

×