E-Paper
Advertisement

Sunil Reddy : ఢిల్లీలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత.. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు..

Sunil Reddy : ఢిల్లీలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత.. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు..
Advertisement

Political news today telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఢిల్లీ వెళ్లి భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరతానని టీపీసీసీ చీఫ్‌కు చెప్పారు. జిల్లా నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం చెబుతామని రేవంత్ స్పష్టంచేశారు.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం సునీల్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్ దక్కకపోవడంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి ప్రశాంత్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో సునీల్ రెడ్డి 27 శాతం పైగా ఓట్లు సాధించారు.

Advertisement

కొంతకాలంగా బీజేపీలో చేరడానికి సునీల్‌రెడ్డి ప్రయత్నాలు చేశారు. ఆయన చేరికను నిజమాబాద్ ఎంపీ అర్వింద్ అడ్డుకున్నారని టాక్ వినిపించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో సునీల్ రెడ్డి కూడా కాంగ్రెస్ చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. స్థానిక నాయకత్వం అంగీకరిస్తేనే కాంగ్రెస్ కండువా కప్పుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఢిల్లీ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సునీల్ రెడ్డి భేటీ అవుతారని తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరికపై త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×