BigTV English

KCR : మహారాష్ట్ర అలా ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఆ పార్టీలకు కేసీఆర్ ప్రశ్నలు..

KCR : మహారాష్ట్ర అలా ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఆ పార్టీలకు కేసీఆర్ ప్రశ్నలు..

KCR speech in maharashtra(News paper today) : తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. మరి మహారాష్ట్రలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు సాధ్యకాదని ప్రశ్నించారు. ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన గులాబీ బాస్ సోలాపుర్‌ జిల్లా సర్కోలీలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అన్ని వనరులూ ఉన్న మహారాష్ట్ర ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పారు.


స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా అభివృద్ధి విషయంలో రాష్ట్రం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. దేశాన్ని 50 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పాలించిందని గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, శివసేన, బీజేపీకి అవకాశం ఇచ్చారని అన్నారు. తెలంగాణ మాదిరిగా మహారాష్ట్ర అభివృద్ధి ఎందుకు సాధ్యం కాదని కేసీఆర్ నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధి సాధించిందని స్పష్టం చేశారు.

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌ అన్న విమర్శలపైనా కేసీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ రైతుల పక్షాల మాత్రమే నిలుస్తుందని తేల్చిచెప్పారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. దేశం సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరముందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.


మహారాష్ట్ర పర్యటనలో సీఎం కేసీఆర్‌ శ్రీవిఠల్‌ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించారు. శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. ఆలయ అర్చకులు కేసీఆర్‌ మెడలో తులసి మాల వేసి ఆశీర్వదించారు. శ్రీవిఠలేశ్వర స్వామి, రుక్మిణీ అమ్మవార్లతో కూడిన ప్రతిమను, అమ్మవారి చిత్రపటాన్ని కేసీఆర్‌కు అందించారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×