BigTV English

Supremecourt : తెలంగాణలో బిల్లులు పెండింగ్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Supremecourt : తెలంగాణలో బిల్లులు పెండింగ్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Supremecourt : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ , రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తోంది. తాజాగా పెండింగ్ బిల్లుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో తాజాగా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.


కేసు నేపథ్యం..
తెలంగాణ ప్రభుత్వం పంపిన 10 బిల్లులను గవర్నర్‌ తమిళిసై ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. దీంతో ఆ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం.. అసెంబ్లీలోని ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌ ముద్ర వేయాలి. గవర్నర్ ఆమోదిస్తేనే ఆ బిల్లులు అమలు చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం పంపిన 10 బిల్లులను తిరస్కరించడమో లేదంటే సూచనలు చేయడమో లేదంటే వెనక్కి తిప్పి పంపడమో గవర్నర్ చేయాలి. కానీ అలా చేయకుండా ఆ బిల్లులను పెండింగ్‌ లో ఉంచారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

గవర్నర్‌తోపాటు గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా తెలంగాణ సర్కార్ తన పిటిషన్ లో పేర్కొంది. అయితే రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌కు తాము నోటీసులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ బిల్లుల ఆలస్యంపై వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.


కేంద్రం తరపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా .. తెలంగాణ గవర్నర్‌ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని సమాధానం చెబుతామని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసుపై మార్చి 27న తుదిపరి విచారణ జరగనుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×