BigTV English

Tammineni Veerabhadram : నిలకడగా తమ్మినేని ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ వైద్యులు..

Tammineni Veerabhadram : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకున్నాయని వైద్యులు పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం గుండెపోటు వచ్చిన వెంటనే వెంటిలేటర్ సహాయంతో ఖమ్మం నుంచి ఏఐజీకి వచ్చిన విషయం తెలిసిందే.

Tammineni Veerabhadram : నిలకడగా తమ్మినేని ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ వైద్యులు..
Political news in telangana

Tammineni Veerabhadram news(Political news in telangana):

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకున్నాయని వైద్యులు పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం గుండెపోటు వచ్చిన వెంటనే వెంటిలేటర్ సహాయంతో ఖమ్మం నుంచి ఏఐజీకి వచ్చిన విషయం తెలిసిందే.


తమ్మినేని వీరభద్రంకు ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు తెలిపారు. ఆయన గుండె, కిడ్నీ,ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారన్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్లు చెప్పారు. ఆయనకు వివిధ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

తమ్మినేని స్వగ్రామం అయిన ఖమ్మం జిల్లా, రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని తన నివాసంలో మంగళవారం గుండెపోటు వచ్చింది. తక్షణమే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రంను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని వీరభద్రం లంగ్స్ ఇన్ఫెక్షన్ తోపాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా, గతంలో కూడా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు అప్పుడు స్టంట్ వేశారు. తాజాగా, మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో ఆందోళన నెలకొంది.

cpm-leader-tammineni-veerabadram-health-bulletin-released

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×