E-Paper
Advertisement

పార్టీ మారినోళ్లకు పీటలు.. మాకు అవమానాలా? బీఆర్ఎస్ ఇన్‌ఛార్జులను నిలదీసిన ఉద్యమకారులు

పార్టీ మారినోళ్లకు పీటలు.. మాకు అవమానాలా? బీఆర్ఎస్ ఇన్‌ఛార్జులను నిలదీసిన ఉద్యమకారులు
Advertisement

BRS Activists: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పట్టణంలోని శ్రీ గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం వేదికగా తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన వ్యక్తమైంది. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఉద్యమకారులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు.

ఉద్యమకారుల నిర్లక్ష్యం..

Advertisement

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమలాంటి ఉద్యమకారులను పార్టీ నాయకత్వం పూర్తిగా విస్మరించిందని వారు మండిపడ్డారు. సమావేశాలకు పిలిచినా కనీస గౌరవం ఇవ్వడం లేదని, స్టేజిపైకి ఆహ్వానించడం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను పక్కన పెట్టి పార్టీలు, కండువాలు మార్చుకుని వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యం కల్పించడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటేనని ఆరోపించారు.

కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి..

Advertisement

ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పదవులు, బాధ్యతలు అప్పగిస్తుండగా, పార్టీ కోసం పోరాడిన ఉద్యమకారులను విస్మరించడం సరైన విధానం కాదని ప్రశ్నించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డికి ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాల గురించి ఎంత అవగాహన ఉందని నిలదీశారు. ఇకపై ఉద్యమకారుల విషయంలో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పార్టీ అధినేత కేసీఆర్ జోక్యం చేసుకుని తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని ఉద్యమకారులు ప్రవీణ్, సంజీవరావులు కోరారు. తమ గోడును మీడియా ద్వారా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Also read: ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×