E-Paper
Advertisement

Minority Welfare: మైనార్టీల ఆర్థికాభివృద్ధికి.. రేవంత్ సర్కార్ ప్రత్యేక కృషి.. రూ.3,500 కోట్లు కేటాయింపు

Minority Welfare: మైనార్టీల ఆర్థికాభివృద్ధికి.. రేవంత్ సర్కార్ ప్రత్యేక కృషి.. రూ.3,500 కోట్లు కేటాయింపు
Advertisement

Minority Welfare: మైనార్టీ సంక్షేమానికి సర్కారు ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. అందుకే మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 3500 కోట్ల కేటాయించిందని ఆయన వివరించారు. బుధవారం నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో తెలంగాణ రాష్ట్ర మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు అసెస్స్, ప్లేస్ మెంట్స్ పంపిణీ చేశారు.

మైనార్టీల కోసం ఆర్థిక సహాయ పథకాల ప్రారంభం, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, శిక్షణ, ఉద్యోగ, ప్లేస్‌మెంట్ కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దిన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. మైనారిటీలలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా సబ్సిడీ ఆధారిత పథకాలు, స్వయం ఉపాధి ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి, అలాగే ఉపాధి కల్పన కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేస్తున్నామని వివరించారు. యువత విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని స్థిరమైన జీవనోపాధిని సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Advertisement

అనంతరం లబ్దిదారులకు మోపెడ్లు, ఈ-బైక్‌లకు మంత్రి జెండా ఊపి పంపిణీ చేశారు. అదే విధంగా ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. దరఖాస్తులు ఈ నెల 19 నుంచి 28 వరకు వెబ్‌సైట్ ద్వారా స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్థికంగా వెనకబడిన ముస్లిం వర్గాలకు ఆర్థిక సహాయం కింద 500 మందికి రూ.93,500 విలువైన మోపెడ్లు వంద శాతం సబ్సిడీపై మంత్రి పంపిణీ చేశారు.

ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కింద 5 వేల మంది అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ఈ పథకానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. మైనారిటీ యువత కోసం ఈ-స్కూటర్ పథకం కింద 3 వేల 150 మందికి ప్రయోజనం కలిగిందని, ఒక్కో యూనిట్ ఖర్చు రూ.లక్షన్నర కాగా అందులో రూ. లక్షా 20 వేలను (80 శాతం) ప్రభుత్వ సబ్సిడీగా రూ.30 వేలు (20 శాతం) లబ్ధిదారుల వాటాగా ఉందని మంత్రి తెలిపారు. ఈ పథకానికి మొత్తం రూ.37.80 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

Advertisement

Also Read: Harish Rao Letter: ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నాటరాజన్‌కు.. హరీశ్ రావు బహిరంగలేఖ.. ఏమన్నారంటే?

మైనార్టీలోని మరి కొన్ని వర్గాలకు చెందిన 2 వేల మందికి జనరేటర్లు , టూల్‌కిట్లు వంద శాతం సబ్సిడీ పై అందించినట్లు, ఒక్కో యూనిట్ ఖర్చు రూ.60 వేలు కాగా, మొత్తం రూ.12 కోట్లు వెచ్చించినట్లు మంత్రి వెల్లడించారు. శిక్షణ, ఉద్యోగం,ప్లేస్‌మెంట్ కార్యక్రమం కింద 55 ఎంప్యానెల్డ్ శిక్షణ సంస్థల ద్వారా 4800 మంది మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు ఇందుకు రూ.9.76 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అలాగే అదనంగా 33 వేల 750 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందించినట్లు ఒక్కో కుట్టు మిషన్ రూ.7,950 వరకు ఉంటుందని వంద శాతం సబ్సిడీపై వీటిని పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

Also Read: Harish Rao: బాల్క సుమన్‌ను.. వెంటనే రిలీజ్ చేయాలి.. హరీశ్ రావు డిమాండ్

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×