E-Paper
Advertisement

Haritha Hotels: తెలంగాణలో పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక హరిత హోటల్స్‌లో మందు కిక్కు..!

Haritha Hotels: తెలంగాణలో పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక హరిత హోటల్స్‌లో మందు కిక్కు..!
Advertisement

Haritha Hotels: స్వేచ్ఛ బ్యూరో: హరిత హోటల్స్ బలోపేతంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. అందులో భాగంగానే పర్యాటకులు ఎక్కువగా వచ్చే హోటల్స్‌లో బార్లు ప్రారంభించాలని భావిస్తుంది. అందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. త్వరలోనే ఆరు హరిత హోటల్స్‌లో బార్లు ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తర్వాత విడుతల వారీగా బార్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

బార్​అండ్​ రెస్టారెంట్ల ఏర్పాటు..

రాష్ట్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 28 హరిత హోటల్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఆదాయం పెంచేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ మార్గాలను అన్వేషిస్తుంది. కొన్ని హోటల్స్ నిర్వహణ భారంగా మారడం, హోట్సల్ కు వచ్చే పర్యాటకులు సైతం వైన్స్ కోసం మార్గాలు అన్వేషిస్తుండటంతో వారి ఆసక్తిని గమనించిన అధికారులు హోటల్స్ లోనే బార్లు నిర్వహిస్తే ఆదాయం పెరుగుతుందని భావిస్తుంది. ఇప్పటికే నిర్వహిస్తున్న హోట్సల్ కు ఆదాయం వస్తుండటంతో విడుతల వారీగా చేయాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. దీంతో హరిత హోటళ్లలో బార్​అండ్​ రెస్టారెంట్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది. ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా కొత్తగా ఆరు హరిత హోటళ్లలో వీటని ఏర్పాటు చేసేందుకు పర్యాటకశాఖ ప్రతిపాదనలు రెడీ చేసింది. ప్రైవేటు హోటళ్లతో పోలిస్తే హరిత హోటళ్లలో వసతులున్నా.. బార్ అండ్​ రెస్టారెంట్ల సదుపాయం లేకపోవడంతో పర్యాటకులు ఇతర ప్రైవేటుకు మొగ్గుచూపుతున్నారు. ఇది గమనించిన పర్యాటకశాఖ అధికారులు ఆదాయాన్ని పెంచాలని, పర్యాటకులకు అందుబాటులోకి బార్లు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది.

అధికారులు ప్రణాళికలు

Advertisement

టూరిజం శాఖ ఇప్పటికే 6 ప్రాంతాల్లోని హరిత హోటల్స్ లో బార్​అండ్​రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని తారామతి బరాదరి, బేగంపేటలోని హరిత ప్లాజా, నాగార్జునసాగర్, వికారాబాద్, వరంగల్,​ నిజామాబాద్ హరిత హోటళ్లలో ప్రస్తుతం బార్​అండ్​రెస్టారెంట్లు నడుస్తున్నాయి. విజయవంతంగా కొనసాగుతుండటంతోపాటు పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఆదాయం వస్తుండటంతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో మిగిలిన టూరిజం హోటల్స్ లో సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేతకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి, కోట, దేవాలయాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం గద్వాలలో, లేక్ వ్యూ పర్యాటకులను ఆకట్టుకునేలా నిజామాబాద్​జిల్లా అలీ సాగర్, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చే పర్యాటకుల కోసం మంచిర్యాల జిల్లా కవ్వాల్(జెన్నారం) బార్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వేములవాడ, భద్రాచలం రెండు చోట్ల ఏర్పాటు చేయాలని భావిస్తూ సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ బార్​అండ్​ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అధికారులు పంపినట్లు సమాచారం. ఈ ప్రపొజల్స్​పై త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయం తీసుకునే చాన్స్​ ఉందని విశ్వసనీయ సమాచారం. కాగా, ఎక్కువగా పర్యాటకులు వచ్చే హరిత హోటల్స్ లో బార్​ అండ్​ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది సక్సెస్​ అయితే.. మిగిలిన హోటల్స్​ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు.

Also Read: Kukatpally Robbery Case: కూకట్‌పల్లి దోపిడీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. బాధితుడే నిందితుడు!

ఆహారం నాణ్యతను కూడా..

Advertisement

పర్యాటక ప్రాంతాల్లో వీకెండ్ కు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. రాత్రిపూట బస చేసే పర్యాటకులు ఎక్కువగా మద్యంపై ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో లిక్కర్ కల్చర్ ఉండటంతో యువత మక్కువ చూపుతుంటారు. హరిత హోటళ్లలో బార్ అండ్​ రెస్టారెంట్​ ఉంటే పర్యాటకులు సురక్షితంగా అక్కడే గడిపే అవకాశం ఉంటుందని, తద్వారా హోటల్ ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తూ ఆదిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మద్యం విక్రయాలకే పరిమితం కాకుండా, హరిత హోటళ్లలో వసతులు, ఆహారం నాణ్యతను కూడా మెరుగుపరచాలని పర్యాటక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎక్సైజ్ నిబంధనలకు లోబడి ఆయా హోటళ్లలో ప్రత్యేకంగా బార్లను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నది. ప్రభుత్వ ఆమోదం రావడమే తరువాయి ఆరు చోట్ల కొత్తగా బార్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఆదాయం పెంచే దిశపై..

అదే విధంగా పర్యాటక ప్రాంతాల్లోని స్థలాలను సైతం వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్కడ ఏం చేస్తే పర్యాటకులకు మెరుగైన సేవలు, సదుపాయాలు కల్పించవచ్చని ఎలా వినియోగించుకోవచ్చని, ఆదాయంను ఎలా పెంచుకోవచ్చనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం, లేక పీపీపీ మోడల్ తో అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ టూరిజంకు ఆదాయం పెంచే దానిపై అధికారులు దృష్టిసారించారు.

Also Read: Natural Farming: రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి ఘనంగా రైతు మహోత్సవాలు: మంత్రి తుమ్మల!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×